అసోసియేట్ డైరక్టర్ గా అనసూయ!

Published : Jan 30, 2019, 06:46 PM IST
అసోసియేట్ డైరక్టర్ గా అనసూయ!

సారాంశం

యాంకర్ అనే పదానికి కొత్త అర్ధాన్ని చెప్పిన జబర్దస్త్ బ్యూటీ అనసూయ ఇప్పుడు ఆర్టిస్ట్ గా కుడా బిజీగా మారుతోంది. ఒక వైపు రియాలిటీ షోలంటూనే మరోవైపు నటిగా కూడా తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకుంటోంది. అనసూయ ఎంచుకుంటున్న పాత్రలు కూడా చాలా వరకు ఆమె కెరీర్ కు ప్లస్ అవుతున్నాయి. 

రంగమ్మత్త ఒక ట్రెండ్ సెట్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు కథనం సినిమాలో మరో వినూత్నమైన పాత్రలో కనిపించడానికి సిద్ధమవుతోంది. ది మంత్ర ఎంట‌ర్‌టైన్మెంట్స్‌ అలాగే ది గాయ‌త్రి ఫిల్మ్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను బి.న‌రేంద్రరెడ్డి, శ‌ర్మచుక్కా నిర్మిస్తున్నారు. 

అనసూయ ప్రధాన పాత్రలో నటించే కథనం సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుందని చిత్ర యూనిట్ చెబుతోంది. క్షణం సినిమా తరహాలో ఉండే క్యారెక్టర్ అని మొదట్లో టాక్ రాగా ఆ విషయంలో ఇప్పుడు అనసూయ క్లారిటీ ఇచ్చింది. ఆ పాత్రకు ఇప్పుడు చేస్తోన్న పాత్రకు ఎలాంటి సంబంధం లేదని ఈ కథలో నేను అసోసియేట్ డైరెక్టర్ గా కనిపించబోతున్నట్లు వివరణ ఇచ్చారు. 

ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ లో రెండు సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. మిగతా షూటింగ్ ను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి సమ్మర్ లో సినిమాను రిలీజ్ చెయ్యాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.                       

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan OG2: పవన్ కళ్యాణ్‌ను కలిసిన సుజీత్, ఇదేం స్పీడు బాబోయ్.. ఓజీ 2 కథా చర్చలు షురూ
Ananya Nagalla: యోగా డే విన్యాసాలతో ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న అనన్య నాగళ్ళ.. ఫోటోస్, వీడియోస్ వైరల్