వెంకీ మామ మల్టీస్టారర్ లో రానా!

Published : Jan 30, 2019, 05:42 PM IST
వెంకీ మామ మల్టీస్టారర్ లో రానా!

సారాంశం

దగ్గుబాటి హీరో వెంకటేష్ మరో మల్టీస్టారర్ సినిమాకు రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. జైలవకుశ వంటి బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న దర్శకుడు కెఏస్.రవీంద్ర తెరకెక్కించనున్న వెంకీ మామ సినిమాలో నాగ చైతన్యతో కలిసి వెంకీ అల్లరి చేయబోతున్నాడు. 

ఇప్పటికే మెగా హీరో వరుణ్ తో ఎంతో ఫన్ అంటూ హిట్టు కొట్టిన వెంకీ ఈ సినిమాలో కొంచెం డిఫరెంట్ గా కనిపించబోతున్నాడు. మాస్ అంశాలు కూడా సినిమాలో బాగానే ఉంటాయని సమాచారం. ఇకపోతే వెంకీ - నాగ చైతన్యలతో పాటు ఈ సినిమాలో మరో దగ్గుబాటి హీరో కూడా నటించనున్నట్లు సమాచారం. 

రానా కొన్ని నిమిషాల పాటు అతిధి పాత్రలో కనిపించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ ఇదే ఏడాది సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని అనుకుంటోంది. సురేష్ బాబు ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ - హుమా ఖురేషి కథానాయికలుగా నటిస్తున్నారు. 

asianet news special

వెంకటేష్ మల్టీస్టారర్స్.. బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్! 

PREV
click me!

Recommended Stories

Rachita Ram: బాడీ షేమింగ్ కామెంట్స్ పై కూలీ నటి స్ట్రాంగ్ రియాక్షన్, అలాంటి వాళ్ళు నిజంగా మూర్ఖులే
Malavika Mohanan: డైలాగ్స్ చెప్పమంటే ఏబీసీడీలు చదువుతారు.. హీరోయిన్లపై రాజాసాబ్ బ్యూటీ కామెంట్స్