Pawan Kalyan-Renu Desai: ఆమెను ఇప్పుడు గెలకడం అవసరమా అధ్యక్షా!

Published : Apr 11, 2023, 05:13 PM ISTUpdated : Apr 11, 2023, 05:21 PM IST
Pawan Kalyan-Renu Desai: ఆమెను ఇప్పుడు గెలకడం అవసరమా అధ్యక్షా!

సారాంశం

రేణు దేశాయ్ ని రెచ్చగొట్టిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయనకు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టారు. ఆమె వరుస పోస్ట్స్ పెడుతుండగా... పవన్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది.   

హీరో పవన్ కళ్యాణ్ శత్రువులు ఎక్కడో ఉండరు అభిమానులు రూపంలో ఆయన పక్కనే తిరుగుతుంటారు. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. గుట్టుగా బ్రతుకుతున్న రేణు దేశాయ్ ని ప్రతిసారి గెలుకుతూ పవన్ కళ్యాణ్ పరువు తీస్తున్నారు. పలుమార్లు ఇది రిపీట్ అవుతుంది. వారి చర్యలు పవన్ పాత గాయాలు రేపుతున్నాయి. తాజాగా అకీరా విషయంలో అనుచిత కామెంట్స్ చేసి రేణు దేశాయ్ ఆగ్రహానికి గురయ్యారు. పవన్ అభిమాని ఒకరు అకీరా మా అన్న కొడుకు అని కామెంట్ చేశాడు. చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేసిన రేణు దేశాయ్ కి సహజంగానే ఈ మాట కోపం తెప్పించింది. ఇక రచ్చ స్టార్ట్...

'అన్న కొడుకా??? అకీరా నా కొడుకు. నువ్వు ఒక తల్లికే పుట్టావా?' అని రేణు ఫైర్ అయ్యారు. మా వాడు తప్పేం అన్నాడంటూ అతనికి మద్దతుగా పవన్ ఫ్యాన్స్ రేణు మీద దాడికి దిగారు. ఏ పొలిటికల్ పార్టీకో అమ్ముడుబోయి ఉంటావు. ఎన్నికలు వస్తున్నాయి కదా మళ్ళీ స్టార్ట్ చేశావంటూ... రేణు మీద వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు. రేణు దేశాయ్ కి మరింత చిర్రెత్తుకొచ్చింది. నేను తలచుకుంటే మీ అన్న జైలుకి వెళ్ళేవాడని పరోక్షంగా తెలియజేసే ఓ వీడియో ఇంస్టాగ్రామ్ లో పెట్టింది.

రేణు దేశాయ్ పోస్ట్ చేసిన వీడియోలో ఓ మహిళ ఆమెకు మద్దతుగా పవన్ మీద దారుణ ఆరోపణలు చేసింది. పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేశాడు. పిల్లల్ని కన్నాడు వంటి రహస్యాలు బయటకు చెప్పింది. మొదటి భార్యతో విడాకులు అవుతాయో లేదో కూడా తెలియకుండా రేణు దేశాయ్ ఆయనకు సర్వం అర్పించింది. అలాంటి మహిళను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వేధించారని ఆమె విమర్శలు గుప్పించారు. 

ఆ వీడియోలో మహిళ మాటలన్నీ తనవే అన్నట్లు రేణు తీరు ఉంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ని మూడు పెళ్లిళ్ల వ్యవహారంలో ప్రతిపక్షాలు ఏకిపారేస్తున్నాయి. రేణు దేశాయ్ కి పవన్ అన్యాయం చేశాడంటూ యాంటీ ఫ్యాన్స్ ఎద్దేవా చేస్తుంటారు. సద్దుమణిగిన మేటర్ పవన్ ఫ్యాన్స్ చర్యల కారణంగా మళ్ళీ తెరపైకి వస్తుంది. వెంటనే పవన్ కళ్యాణ్ అభిమానులనో లేక రేణునో సైలెంట్ చేయాలి. ఈ వివాదానికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందని ఆయన శ్రేయోభిలాషులు సూచిస్తున్నారు.  

లక్షల అభిమానులను కంట్రోల్ చేయడం కష్టం. అది ఆయనకు కూడా తెలుసు. కాబట్టి పవన్ రేణు దేశాయ్ ని రిక్వెస్ట్ చేసి ఈ వివాదం వదిలేయమని చెబితే బెటర్ అని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. లేదంటే ఆయన వ్యతిరేక వర్గాలు రేణు దేశాయ్ తరపున వకాల్తా పుచ్చుకుంటే వివాదం మరింత పెద్దది అవుతుందంటున్నారు. రేణు దేశాయ్-పవన్ కళ్యాణ్ లకు విడాకులు అయినప్పటికీ స్నేహం ఉంది. కాబట్టి ఆయన చెప్తే రేణు వింటారనడంలో సందేహం లేదు. గత ఏడాది కొడుకు అకీరా గ్రాడ్యుయేషన్ డే ప్రోగ్రాంలో పవన్-రేణు కలిసి పాల్గొన్నారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Top 10 Movies 2025: పవన్, వెంకటేష్, రాంచరణ్ లలో బాక్సాఫీస్ వద్ద ఎవరి సత్తా ఎంత ? 2025లో టాప్ 10 మూవీస్ ఇవే
Akhanda 2: అఖండ 2 రిలీజ్ కి తొలగిన అడ్డంకులు, మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కానీ ఆ ఒక్క సమస్య ఇంకా ఉంది