చిక్కుల్లో బాలీవుడ్ సెలెబ్రిటీ, అతడి సినిమాలు విడుదల కానివ్వం.. 'తాలిబాన్' వ్యాఖ్యల ఎఫెక్ట్

By telugu teamFirst Published Sep 5, 2021, 10:16 AM IST
Highlights

బాలీవుడ్ ప్రముఖ రచయిత, లిరిసిస్ట్ జావేద్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు ఆయన్ని చిక్కుల్లో పడేశాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జావేద్ అక్తర్ ఆర్ఎస్ఎస్ ని తాలీబాన్స్ తో పోల్చుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఆఫ్గనిస్తాన్ లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తాలిబాన్ గురించి అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. ఇండియాలో కూడా తాలిబాన్ గురించి అలజడి మొదలయింది. ఈ నేపథ్యంలో కొందరు ప్రముఖులు తాలిబాన్ గురించి ప్రస్తావిస్తూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. 

బాలీవుడ్ ప్రముఖ రచయిత, లిరిసిస్ట్ జావేద్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు ఆయన్ని చిక్కుల్లో పడేశాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జావేద్ అక్తర్ ఆర్ఎస్ఎస్ ని తాలీబాన్స్ తో పోల్చుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనితో ఆర్ఎస్ఎస్ అభిమానులు, బిజెపి నేతలు జావేద్ పై విరుచుకుపడుతున్నారు. 

మహారాష్ట్రకు చెందిన బిజెపి ఎమ్మెల్యే రామ్ కదమ్ జావేద్ అక్తర్ పై తీవ్ర విమర్శలు చేశారు. జావేద్ తాన్ వ్యాఖ్యలని వెనక్కి తీసుకుని, రెండు చేతులు జోడించి క్షమాపణ అడగాలి. లేకుంటే అతడి సినిమాలు ఇండియాలో రిలీజ్ కానివ్వం అని వార్నింగ్ ఇచ్చారు. 

ఆయన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నారు. ఆర్ఎస్ఎస్ ని, విశ్వ హిందూ పరిషత్ ని కోట్లాది మంది ఫాలో అవుతారు. అలాంటి వారందరి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి. ఆయన చేసిన కామెంట్స్ షేమ్ ఫుల్ అని ఎమ్మెల్యే రామ్ కదమ్ అన్నారు. 

ఇంతకీ జావేద్ చేసిన వ్యాఖ్యలు ఏంటంటే.. 'తాలిబాన్లు ముస్లిం రాజ్యం మాత్రమే ఉండాలని ఎలా కోరుకుంటారో ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా అంతే. హిందూ రాజ్యమే ఉండాలి భావిస్తారు. తాలిబాన్స్, ఆర్ ఎస్ఎస్ వాళ్ళ మైండ్ సెట్ ఒకే విధంగా ఉంటుంది. వీళ్లతో పాటు విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ వీళ్లంతా ఒకే కోవకు చెందిన వారు అంటూ జావేద్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

click me!