వినాయక చవితిని టార్గెట్‌ చేసిన విజయ్‌ సేతుపతి `లాభం`..

Published : Sep 04, 2021, 08:13 PM IST
వినాయక చవితిని టార్గెట్‌ చేసిన విజయ్‌ సేతుపతి `లాభం`..

సారాంశం

`లాభం` సినిమాకి సంబంధించి విజయ్‌ సేతుపతి, శృతి హాసన్‌ వినాయక్‌ చవితిని టార్గెట్‌ చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని తెలుగు, తమిళంలో ఏక కాలంలో ఈ నెల(సెప్టెంబర్‌) 9న సినిమాని విడుదల చేయబోతున్నారు. 

విజయ్‌ సేతుపతి, శృతి హాసన్‌ జంటగా నటించిన చిత్రం `లాభం`. తమిళంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయబోతున్నారు. `లాభం` పేరుతోనే ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్‌ చేయబోతున్నారు. ఎస్‌.పి. జననాథన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లాయర్‌ శ్రీరామ్‌ సమర్పణలో శ్రీ గాయత్రి దేవి ఫిల్మ్స్ పతాకంపై నిర్మాత బత్తుల సత్యనారాయణ(వైజాగ్‌ సతీష్‌) తెలుగులో విడుదల చేస్తున్నారు. 

ఈ సినిమాకి సంబంధించి విజయ్‌ సేతుపతి, శృతి హాసన్‌ వినాయక్‌ చవితిని టార్గెట్‌ చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని తెలుగు, తమిళంలో ఏక కాలంలో ఈ నెల(సెప్టెంబర్‌) 9న సినిమాని విడుదల చేయబోతున్నారు. రీసెంట్‌గా ఈ సినిమా ట్రైల‌ర్‌ను విజ‌య్ సేతుప‌తి విడుద‌ల చేశారు. ఆయన బెస్ట్ విషెస్‌ తెలియజేశారు. 

ఈ సంద‌ర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, `విజయ్ సేతుప‌తి, శ్రుతిహాస‌న్ జంట‌గా న‌టించిన `లాభం` చిత్రం  వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌ల‌వుతుంది. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో పాటు అన్ని కమ‌ర్షియ‌ల్ హంగులతో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తుండ‌టం హ్యాపీగా ఉంది. తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుంది. విజయ్ సేతుపతి చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నందుకు గర్వంగా ఉంది` అని అన్నారు.

విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్, జగపతిబాబు, సాయి ధన్సిక, కలైయ రసన్, రమేష్ తిలక్, పృత్వి రాజన్, డేనియల్ అన్నే పోపే, నితీష్ వీర, జయ్ వర్మన్ తదితరులు నటిస్తున్నారు.  హరీష్ బాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. డి.ఇమామ్‌ మ్యూజిక్‌, రాంజీ కెమెరామెన్‌గా పనిచేస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Balakrishna: నిజమే, పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య త్యాగం.. ఓజీ గెలిచింది ఇప్పుడు అఖండ 2 గెలవాలి
ఆరేళ్ల పాటు సహజీవనం చేసి, ఇద్దరు పిల్లలకు తండ్రయ్యాక నిశ్చితార్థం చేసుకున్న నటుడు