
సూపర్ స్టార్ మహేష్.. సౌత్ లో ఈ పేరు ఒక బ్రాండ్. వెండితెరపై తిరుగులేని స్క్రీన్ ప్రజన్స్ తో హ్యాండ్సమ్ గా కనిపించే హీరో మహేష్ బాబు. మహేష్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక సినీ తారలు తమ పాపులారిటీని బట్టి కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తుంటారు.
ఎండార్స్మెంట్ విషయంలో మహెష్ బ్రాండ్ వాల్యూ నేషనల్ లెవల్ కి చేరింది. గత కొన్నేళ్లలో మహేష్ కళ్ళు చెదిరే విధంగా కార్పొరేట్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్నాడు. ఇప్పటికే పలు బ్రాండ్స్ కి ప్రచార కర్తగా వ్యవహరిస్తున్న మహేష్ విషయంలో మరో క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.
మహేష్ బాబు, బాలీవుడ్ యంగ్ స్టార్ టైగర్ ష్రాఫ్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఇప్పటికే మహేష్ బాబు.. బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ తో ఓ బ్రాండ్ కోసం యాడ్ షూట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు టైగర్ ష్రాఫ్ తో కలసి ఓ మౌత్ ఫ్రెష్నర్ బ్రాండ్ కి ప్రచారం కల్పించబోతున్నాడు.
యాడ్ షూట్ ఇప్పటికే పూర్తయినట్లు వినికిడి. త్వరలోనే ఈ యాడ్ టెలికాస్ట్ కానుంది. మహేష్, టైగర్ ష్రాఫ్ ని కలసి చూడడం ఫ్యాన్స్ కి ట్రీట్ అనే చెప్పాలి. ఏది ఏమైనా ఎండార్స్మెంట్స్ విషయంలో మహేష్ దూకుడు మామూలుగా లేదు.
సినిమాల విషయానికి వస్తే మహేష్ ప్రస్తుతం పరుశురాం డైరెక్షన్ లో 'సర్కారు వారి పాట' చిత్రంలో నటిస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.