
ఒక్కసారి కన్ను గీటి కుర్రాళ్ల మనసు కొల్లగొట్టేసింది మల్లు బ్యూటీ ప్రియా వారియర్ గుర్తుండిపోయే ఉంటుంది. వింక్ గర్ల్ గా ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకుంది ఈ భామ అనుకున్న స్దాయిలో ముందుకు వెళ్లలేకపోయింది. ముఖ్యంగా ఆమె కన్నుగీటి.. గన్ షూట్ చేసినట్లుగా చేసి అభినయం కుర్రాళ్లకు కైపెక్కించింది. ఈ బ్యూటీకి వచ్చిన క్రేజ్ చూసి ఆ సినిమాను తెలుగులోనూ డబ్ చేశారు. ఓవర్ నైట్ సెన్సేషన్ క్రియేట్ చేసినా.. ఈ భామ నటించిన తొలి సినిమా ఒరు ఆధార్ లవ్ మాత్రం ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయింది. ఈ సినిమాలో ప్రియా అందం.. అభినయం చూసిన ప్రేక్షకులు మాత్రం ప్రియాను చూసి ఫిదా అయ్యారు కానీ ఫలితం లేదు.
ఆ తర్వాత నితిన్ తో చెక్, తేజ సజ్జాతో కలిసి ఇష్క్ లో నటించింది. ఆ రెండు సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక అప్పటినుంచి ఈ భామ తెలుగు తెరపై కనుమరుగైపోయింది. సినిమా ఆఫర్లు లేకున్నా ప్రియాకు సోషల్ మీడియాలో మాత్రం చాలా క్రేజ్ ఉంది. ఇప్పటికే 7 మిలియన్ ఫాలోవర్లతో ఇన్ స్టాగ్రామ్ లో దూసుకెళ్తోంది. ఇక తరచూ ఫొటోషూట్స్ చేస్తూ ఆ ఫొటోలను సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా ఆమె మరో తెలుగు సినిమా ఓకే చేసింది. ఆ సినిమా పవన్ హీరోగా చేస్తూండటం విశేషం. ఆ సినిమా మరోదో కాదు ఈ రోజు లాంచ్ అయిన చిత్రం. . ప్రముఖ తమిళ నటుడు/దర్శకుడు సముద్రఖని దర్శకత్వం వహించిన సూపర్ హిట్ తమిళ చిత్రం వినోదయ సీతమ్ రీమేక్.
పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభమైంది. లాంచ్ ఈవెంట్‌లో సముద్రఖని, త్రివిక్రమ్, థమన్, టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల తదితరులు పాల్గొన్నారు. సాయి ధరమ్ తేజ్ తన మామయ్యతో కలిసి పనిచేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. కాగా ఆయన తన ఆనందాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. తనకు గురువులాంటి పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం రావడంతో తన కల సాకారమైందని అన్నారు. ఈ సినిమాలో పవన్ కు జోడి అంటూ ఎవరూ ఉండరు. ఇక సాయి ధరమ్ తేజ్ కు జోడిగా ప్రియా వారియర్ ని ఎంపిక చేసారు.
ఫాంటసీ కామెడీగా రూపొందనున్న ఈ చిత్రానికి సముద్రకని దర్శకత్వం వహించనున్నారు. చిత్ర యూనిట్ ఈరోజు రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించింది. భారీ స్థాయిలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికలుగా నటిస్తున్నట్లు సమాచారం. జీ స్టూడియోస్‌తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ ఎస్ స్వరాలు సమకూరుస్తున్నారు.