
అఖిల్ కెరీర్ లో చెప్పుకోదగ్గ హిట్స్ లేవు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం ఒక్కటే రిలీఫ్ ఇచ్చింది. దాంతో నాగార్జున తన దృష్టి మొత్తం అఖిల్ పై పెట్టినట్లు సమాచారం. తను నటనా జీవితం నుంచి రిటైర్ అయ్యేలోగా కొడుకులిద్దరిని సెట్ చేయాలని ఆలోచనలో ఉన్నారు. నాగచైతన్య ఓ ట్రాక్ లో పడి పోయారు. ఇక అఖిల్ వంతు ఇప్పుడు. దాంతో అఖిల్ తో తనే స్వయంగా నటిస్తూ ఓ చిత్రం ప్లాన్ చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే...
ఇప్పటికే విడుదలైన అనేక మల్టీస్టారర్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. తాజాగా మరో సినిమా రెడీ అవుతుంది. తండ్రికొడుకులు అక్కినేని నాగార్జున, అకిల్ కాంబోలో ఓ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాకు డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కించిన గాడ్ ఫాదర్ చిత్రం యావరేజ్ అనిపించుకుంది. ఈ సినిమా తర్వాత మోహన్ రాజా నాగ్, అఖిల్ కాంబోలో మల్టీస్టారర్ తెరకెక్కించనున్నారట.
ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యిందని.. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ ని అన్నపూర్ణ స్టూడియోస్ నే ప్రత్యేకంగా నిర్మించడానికి ముందుకొచ్చిందిట. బడ్జెట్ పరంగా స్ర్కిప్ట్ హై రేంజ్ లోనే కనిపిస్తుందిట. ఈ నేపథ్యంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ భాగస్వామ్యం అయినా ఆశ్చర్యపోనవసరం లేదని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తుంది. స్టోరీ లైన్ మాత్రం చాలా ఇన్నోవేటివ్ గా ఉంటుందని అంటున్నారు.
ఇటీవలే ది ఘోస్ట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ్.. ఆశించినంతగా మెప్పించలేకపోయాడు. దీంతో కాస్త సమయం తీసుకుని తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించాలని చూస్తున్నారట. అలాగే మరోవైపు అఖిల్ కూడా ప్రస్తుతం ఏజెంట్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. త్వరలోనే ఈ మూవీ కంప్లీట్ కానున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా పూర్తైన తర్వాత తండ్రితో కలిసి చేయనున్న మూవీలో జాయిన్ కానున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇక నాగ్ కెరీర్లో రాబోయే 100వ సినిమా గురించి కూడా ఆసక్తికర చర్చ నడుస్తోంది.
ఈలోపు అఖిల్ కూడా తన తాజా చిత్రం ‘ఏజెంట్’ను దాదాపు పూర్తి చేసేస్తాడు. ఆ తర్వాత తండ్రితో కలిసి చేయనున్న సినిమా సెట్స్‌లో అడుగుపెడతారని టాక్. ఇదిలా ఉంటే.. ఇది నాగార్జున కెరీర్‌లో వందో చిత్రం అనే టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.అఖిల్ అక్కినేని 'ఏజెంట్' మూవీ విషయానికి వస్తే.. అక్కినేని అఖిల్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ మూవీ ఏజెంట్. సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అఖిల్‌కు జోడీగా సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తుండగా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.
తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ అప్‌డేట్‌ను అందించారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఈ చిత్రం నుంచి త్వరలోనే మ్యూజికల్ ట్రీట్‌ను విడుదల చేయనున్నారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. కాగా పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఏప్రిల్28న విడుదల కానుంది.