‘వైల్డ్ డాగ్’: నాగ్ నిర్ణయం ..నిర్మాతలకి నష్టమా?

By Surya Prakash  |  First Published Mar 1, 2021, 5:16 PM IST


తాజాగా నాగార్జున ‘వైల్డ్ డాగ్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అహిషోర్ సాల్మోన్ ద‌ర్శక‌త్వం వహించిన ఈ సినిమా ఏప్రియల్ 2 న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో డేర్ డెవిల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నాగార్జున నటిస్తున్నారు. దాదాపు ఎక్కువమంది కొత్తవాళ్లతోనే ఈ సినిమా చేశారు నాగార్జున. ఈ సినిమాలో నాగార్జున ఎన్‌.ఐ.ఎ ఆఫీస‌ర్‌గా కనిపించనున్నారు. 


తాజాగా నాగార్జున ‘వైల్డ్ డాగ్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అహిషోర్ సాల్మోన్ ద‌ర్శక‌త్వం వహించిన ఈ సినిమా ఏప్రియల్ 2 న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో డేర్ డెవిల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నాగార్జున నటిస్తున్నారు. దాదాపు ఎక్కువమంది కొత్తవాళ్లతోనే ఈ సినిమా చేశారు నాగార్జున. ఈ సినిమాలో నాగార్జున ఎన్‌.ఐ.ఎ ఆఫీస‌ర్‌గా కనిపించనున్నారు. 

అసిస్టెంట్ క‌మీష‌న‌ర్ ఆఫ్ పోలీస్ విజ‌య్ వ‌ర్మను పోలీస్ శాఖ‌లో అంద‌రూ వైల్డ్ డాగ్ అని పిలుస్తుంటారు. నిజ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నారు. నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ చిత్రం మొదట నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేద్దామని నిర్మాతలు ఫిక్స్  అయ్యారు. ఈ మేరకు ఎగ్రిమెంట్ కూడా జరిగింది. అయితే ఇప్పుడు దాన్ని రద్దు చేసుకుని డైరక్ట్ థియోటర్ రిలీజ్ కు పెట్టారు. దీని వల్ల నిర్మాతలకు చాలా నష్టపోతున్నారని ట్రేడ్ లో వినపడుతోంది.

Latest Videos

వివరాల్లోకి వెళితే... ‘వైల్డ్ డాగ్’ ని నెట్ ఫ్లిక్స్  తమ ఫ్లాట్ ఫార్మ్ లో రిలీజ్ చేసేందుకు నెట్ ఫ్లిక్స్ నిర్మాతలకు భారీ మొత్తం ఆఫర్ చేసింది. అక్షరాలా 27 కోట్ల రూపాయలు. అంతేకాకుండా ఈ ఎగ్రిమెంట్ లో మిగతా రైట్స్ ఏమీ కలపలేదు. నిర్మాతలు… శాటిలైట్, హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా అమ్ముకోవచ్చు. ఆ లెక్కన నాగార్జున సినిమాకి ఇది బంపర్ ఆఫర్. అందుకే నిర్మాతలు మారుమాట్లాడకుండా ఎగ్రిమెంట్  చేసుకున్నారు. అయితే ఇప్పుడు బయిట పరిస్దితులు చూసి నాగార్జున మనసు మార్చుకున్నాడు. దాంతో నిర్మాతలకు వేరే ఆప్షన్ లేకుండా పోయిందిట. నెట్ ఫ్లిక్స్ తో చేసుకున్న ఎగ్రిమెంట్  రద్దు చేసుకున్నారు. డైరెక్ట్ గా ఓటిటిలో కాకుండా… ముందు థియేటర్లో రిలీజ్ చేసి తర్వాత డిజిటల్ రిలీజ్ కావాలని అగ్రిమెంట్ మార్చుకున్నారు. దాంతో నెట్ ప్లిక్స్ వారు చెల్లించే రేట్లు కూడా మారిపోయాయి.

దాన్ని బట్టి ఈ సినిమా థియేటర్లోకి వచ్చి దాదాపు 60 కోట్ల గ్రాస్ పొందితేనే నెట్ ప్లిక్స్ ఇస్తానన్న ఆఫర్ కు సరపడ ఎమౌంట్ రికవరీ అవుతుంది., అంతకన్నా తక్కువ వసూళ్లు వస్తే… నిర్మాతల నిర్ణయం తప్పు అవుతుంది. కానీ నాగార్జన సినిమాలకు ఇప్పుడున్న పరిస్దితుల్లో ఆ స్దాయి ఓపినింగ్స్  ఉన్నాయా అనేది పెద్ద క్వచ్చిన్.
   
 మన్మధుడు 2 సినిమా డిజాస్టర్ అయ్యాక ఆయన సినిమాలకు బిజినెస్,క్రేజ్ తగ్గిపోయింది. 2016లో వచ్చిన ఊపిరి తర్వాత నాగార్జునకు సరైన హిట్ పడలేదు.   ఇక పవర్-ప్యాక్డ్ యాక్షన్ ఫిలింగా తయారవుతున్న ‘వైల్డ్ డాగ్’ పై నాగార్జున అభిమానులకు మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి.   26/11 ముంబై దాడుల నేపధ్యంలో ఈ సినిమా రూపొందుతోంది.  ఈ సినిమాలో పాటలు ఉండవని తెలుస్తోంది. కేవలం రీరికార్డింగ్ కోసమే సంగీత దర్శకుడుని తీసుకుంటున్నట్లు సమాచారం.ఈ చిత్రంలో ప్రత్యేకమైన కామెడీ కానీ, హీరోయిన్ కానీ ఉండదు. ఓ హాలీవుడ్ చిత్రంలాగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.  

 `గగనం` తర్వాత నాగార్జున ఇలాంటి ప్రయోగం తరహా పాత్రలో కనిపించనున్నారు.  ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.నాన్ స్టాప్ గా షూటింగ్ చేసి, తక్కువ బడ్జెట్ , తక్కువ వర్కింగ్ డేస్ లో ఫినిష్ చేసి అతి త్వరలో రిలీజ్ చేయబోతున్నారు.  ఈ చిత్రానికి కెమెరా: షానీ డియోల్‌. 
 

click me!