రెడ్ క్లాత్‌‌.. ఏకే 47 గన్‌.. కామ్రేడ్‌గా మారిన రామ్‌చరణ్‌..బర్త్ డే ట్రీట్‌ రెడీ?

Published : Mar 01, 2021, 04:22 PM ISTUpdated : Mar 01, 2021, 04:31 PM IST
రెడ్  క్లాత్‌‌.. ఏకే 47 గన్‌.. కామ్రేడ్‌గా మారిన రామ్‌చరణ్‌..బర్త్ డే ట్రీట్‌ రెడీ?

సారాంశం

ఆచార్యగా చిరంజీవి కనిపిస్తే, సిద్ధగా రామ్‌చరణ్‌ కనిపించనున్నారు. ఇప్పటికే ఆయన షూటింగ్‌లో పాల్గొన్నారు. ఆయన ప్రీ లుక్‌ ఆకట్టుకుంది. బ్లాక్‌ షర్ట్, మెడలో రుద్రక్ష మాలతో ఉన్నారు చరణ్‌. తాజాగా చరణ్‌కి సంబంధించిన మరో ప్రీ లుక్‌ని రిలీజ్‌ చేసింది చిత్ర బృందం.

చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` చిత్రం రూపొందుతుంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై నిరంజన్‌రెడ్డి నిర్మిస్తున్నారు. చిరు సరసన కాజల్‌ నటిస్తుంది. రామ్‌చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఆచార్యగా చిరంజీవి కనిపిస్తే, సిద్ధగా రామ్‌చరణ్‌ కనిపించనున్నారు. ఇప్పటికే ఆయన షూటింగ్‌లో పాల్గొన్నారు. ఆయన ప్రీ లుక్‌ ఆకట్టుకుంది. బ్లాక్‌ షర్ట్, మెడలో రుద్రక్ష మాలతో ఉన్నారు చరణ్‌. 

తాజాగా చరణ్‌కి సంబంధించిన మరో ప్రీ లుక్‌ని రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. రామ్‌చరణ్‌, కొరటాల శివ దీన్ని ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు. ఇందులో తాను కామ్రేడ్‌గా(నక్సల్‌)గా కనిపించబోతున్నట్టు తెలిపారు. చరణ్‌పై చిరంజీవి చేయి, చేయికి ఎర్రని క్లాత్‌ ముందు ఎకే 47 తుపాకీ ఉన్నాయి. ఈ ప్రకారంగా ఇందులో రామ్‌చరణ్‌ సిద్ధ అనే నక్సలైట్‌గా కనిపిస్తారని, వీరికి చిరంజీవి నాయకుడిగా ఉంటాడని తెలుస్తుంది. 

ఈ సందర్భంగా రామ్‌ చరణ్‌ చెబుతూ, `కామ్రేడ్‌ మూవ్‌మెంట్‌. డాడీతో, కొరటాల శివతో పనిచేసే ప్రతి మూవ్‌మెంట్‌ని ఎంజాయ్‌ చేస్తున్నా. `ఆచార్య` సెట్‌` అని చెబుతూ, తాజా ఫోటోని పంచుకున్నారు. ప్రస్తుతం చరణ్‌, చిరంజీవిపై కీలక సన్నివేశాలు షూట్‌ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు కొరటాల శివ చెబుతూ, ``ఆచార్య `సిద్ధ`మవుతున్నాడు` అని తెలిపారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌ అవుతుంది. ఈ నెల 27న రామ్‌చరణ్‌ బర్త్ డే. ఈ సందర్భంగా ఇందులోని రామ్‌చరణ్‌ లుక్‌ విడుదల చేసే అవకాశం ఉంది. తన ఫ్యాన్స్ కి ట్రీట్‌ ఇవ్వబోతున్నారు. మరోవైపు సినిమాని మే 13న విడుదల చేయబోతున్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?