కృతి శెట్టి గురించి చెబుతానంటోన్న సుధీర్‌బాబు.. ఏం చెప్పబోతున్నాడు?

Published : Mar 01, 2021, 04:44 PM ISTUpdated : Mar 01, 2021, 04:48 PM IST
కృతి శెట్టి గురించి చెబుతానంటోన్న సుధీర్‌బాబు.. ఏం చెప్పబోతున్నాడు?

సారాంశం

కృతి శెట్టి ఇప్పుడు సుధీర్‌బాబుతో కలిసి ఓ సినిమాలో నటిస్తుంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ని సోమవారం సాయంత్రం విడుదల చేశారు. `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` అనే టైటిల్‌ని ఖరారు చేశారు. 

`ఉప్పెన` సినిమాతో క్రేజీ హీరోయిన్‌గా మారింది కృతి శెట్టి. ఆమె ఇప్పుడు సుధీర్‌బాబుతో కలిసి ఓ సినిమాలో నటిస్తుంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ని సోమవారం సాయంత్రం విడుదల చేశారు. `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` అనే టైటిల్‌ని ఖరారు చేశారు. చిన్న వీడియోలో సుధీర్‌బాబు ఈ విషయం చెబుతూ తాజా టైటిల్‌ని ప్రకటించారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. జనరల్‌గా ఇంద్రగంటి సినిమాలే డిఫరెంట్‌గా ఉంటాయి. డిఫరెంట్‌ టైటిల్స్ తో మ్యాజిక్‌ చేస్తారు. ఈ సినిమాతోనూ అదే చేయబోతున్నట్టు టైటిల్‌ని బట్టి అర్థమవుతుంది. 

ఇక ఇది ఇంద్రగంటితో సుధీర్‌బాబు నటిస్తున్న మూడో సినిమా. ఇప్పటికే `సమ్మోహనం`,  `వి` చిత్రాలు చేసిన విషయం తెలిసిందే. ఈ రెండూ మిశ్రమ స్పందనని రాబట్టుకున్నాయి. తాజా సినిమాతో హ్యాట్రిక్‌ కొట్టాలని భావిస్తున్నారు. ఇది సుధీర్‌బాబు 14వ సినిమా కావడం విశేషం. ఇక కృతి శెట్టికిది మూడో సినిమా. రెండో చిత్రం నానితో `శ్యామ్‌ సింగరాయ్‌` చేస్తుంది. మరోవైపు సుధీర్‌బాబు ఈ చిత్రంతోపాటు `శ్రీదేవి సోడా సెంటర్‌` అనే చిత్రంలోనూ నటిస్తున్నారు.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Samantha Honeymoon Plans, రాజ్ తో కలిసి రొమాంటిక్ ట్రిప్ ప్లాన్ చేసిన సమంత, ఎక్కడికి వెళ్లబోతున్నారో తెలుసా?
49 ఏళ్ల వయసులో ఇండియాకు మెడల్ సాధించిన నటి, ఏకంగా 4 పతకాలతో మెరిసిన ప్రగతి