విజయ్ దేవరకొండ అందుకే ప్రమోషన్స్ కు రావట్లేదా.?

Published : Mar 09, 2018, 04:03 PM ISTUpdated : Mar 26, 2018, 12:04 AM IST
విజయ్ దేవరకొండ అందుకే ప్రమోషన్స్ కు రావట్లేదా.?

సారాంశం

పెళ్లి చూపులకు ముందు విజయ్ దేవరకొండను పట్టించుకునే వారు తక్కువే అర్జున్ రెడ్డి భారీ హిట్ కొట్టడంతో... రెండు వరుస హిట్లు అతని ఖాతాలో పడ్డాయి  ఏ మంత్రం వేశావే కు కనీసం ప్రచారం కూడా చేయకూడదని విజయ్ డిసైడయ్యాడు

విజయ్ దేవరకొండ అంటే ఒకప్పుడు సైడ్ క్యరెక్టర్ లు చేసేవాడు కాని ఎప్పుడైతే  అర్జున్ రెడ్డి రిలీజ్ అయ్యిందో మనోడి ఫేట్ మారిపోయింది.  అర్జున్ రెడ్డి సూపర్ హిట్ కొట్టడంతో వెనక్కి తిరిగిచూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.  తరువాత తనకంటూ ఒక మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాతో మనముందుకు వస్తున్నాడు. అదే ఏ మంత్రం వేశావే... కానీ ఆ సినిమాను పెద్ద సీరియస్గా తీసుకోవడం లేదు విజయ్. ప్రమోషన్స్ కు కూడా దూరంగా ఉంటున్నాడు ఎందుకు?

పెళ్లి చూపులకు ముందు విజయ్ దేవరకొండను పట్టించుకునే వారు తక్కువే. అర్జున్ రెడ్డి భారీ హిట్ కొట్టడంతో... రెండు వరుస హిట్లు అతని ఖాతాలో పడ్డాయి. ఆ తరువాత వచ్చే సినిమాపై అంచనాలు భారీగా పెరగడం సాధారణమే. ఏం సినిమా వస్తుందా అని ఎదురుచూసిన వాళ్లకి... ఏ మంత్రం వేశావే సినిమా వచ్చింది కళ్ల ముందుకి. కానీ ఆ సినిమాకి కనీసం ప్రచారం కూడా చేయకూడదని విజయ్ డిసైడయ్యాడు. పాత సినిమా అని హింట్ లు కూడా ఇచ్చాడు.  విజయ్ చెప్పింది నిజమే. ఆ సినిమా ఇప్పటిది కాదు... 2013లో తీసిన సినిమా. అప్పట్లో విజయ్ ఎవరో ప్రేక్షకులకు కూడా తెలియదు. దీంతో సగం తీసి ఆపేశారు. ఇప్పుడు విజయ్ కు వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని భావించి... ఆ సినిమాను కంప్లీట్ చేస్తున్నారు. 

షూటింగ్ లో ఉన్నప్పుడే విజయ్ కు మరో విషయం కూడా తెలిసింది. ఆ సినిమా ఓ హాలీవుడ్ మూవీ కాపీ అని. 1997లో విడుదలైన ది గేమ్ మూవీకి ఇది కాపీ అట. దీంతో ఆ సినిమాకు ఎలాంటి ప్రచారం ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాడు అర్జున్ రెడ్డి. ప్రేక్షకులను మోసం చేయడం ఇష్టం లేని విజయ్... ఆ సినిమాను చూడమని ఎవరికీ చెప్పకూడదని స్వతంత్ర నిర్ణయం తీసుకున్నాడు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: భరణి ఎలిమినేటెడ్.. టాప్ 5 సభ్యులు వీరే, ప్రియురాలి కోసం ఇమ్ము చేయబోతున్న త్యాగం ఇదే
రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు