ఆ హీరోతో నాకు లింకా.. మీకేమన్న మెంటలా..

Published : Mar 09, 2018, 02:55 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
ఆ హీరోతో నాకు లింకా.. మీకేమన్న మెంటలా..

సారాంశం

టాలీవుడ్ లో క్రేజ్ సంపాదించి బాలీవుడ్ కి వెళ్లిన ఇలియానా ఆడ కూడా అడపా దడపా అవకాశాలు అజయ్ దేవ్ గన్ మరో ఆఫర్ ఇప్పించేంోదుకు ట్రై చేయటంతో తనతో ఎఫైర్ అంటూ రూమర్స్

దేవదాసు చిత్రంతో హీరోయిన్ గా టాాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బెల్లీ బేబీ ఇలియానా. తన నడుం వొంపుసొంపులతో ఇలియానా తెలుగులో  యంగ్ హీరోల సరసన నటించి మంచి పేరు తెచ్చుకుంది.  అప్పట్లో ఇలియానా అంటే కుర్రకారు మత్తెక్కిపోయేవారు. తెలుగు లో మంచి ఫామ్ లో ఉన్న ఇలియానా బాలీవుడ్ బాట పట్టింది.  అక్కడ రెండు మూడు సినిమాలు తీసినా పెద్దగా పేరు తెచ్చుకోలే పోయింది.

 

దీంతో కొంత కాలంగా తన ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ ఈ మద్య మళ్లీ వెండితెరపై రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తుంది.  ఈ మద్య బాలీవుడ్ లో కొత్త పుకార్లు పుట్టుకు వస్తున్నాయి. తనకు ఆఫర్లు ఇవ్వాలని అజయ్ దేవగణ్ సిఫారసు చేస్తున్నాడంటూ బాలీవుడ్ లో వార్తలు వెలువడడంపై గోవా సుందరి ఇలియానా స్పందించింది.

 

ఈ వార్త వినడానికి మరీ ఫన్నీగా ఉందని..తనను 'రైడ్' మూవీకి అజయ్ సిఫారసు చేశాడని, 'ముబారకన్' కో-స్టార్ అర్జున్ కపూర్ పరిశీలించమని తనవద్దకు ఒక స్క్రిప్టు పంపించాడని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. సాధారణంగా ఒక స్టార్ తో వరుసగా చిత్రాలు తీస్తే..ఆ హీరోతో ఎఫైర్ ఉందని ఎలా అంటారని ప్రశ్నిస్తుంది. అవన్నీ వాస్తవం కాదని స్పష్టం చేసింది.

 

ఏదైనా తనకు నచ్చితేనే చేస్తానని ఇలియానా తెలిపింది. ప్రచారంలో ఉన్నట్టు అజయ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. కాగా, ఇలియానా ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీ బోన్ తో లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నట్టు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..