
సందర్భం ఉన్న లేకున్నా రామ్ గోపాల్ వర్మ(Ram gopal varma) తరచుగా నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లను టార్గెట్ చేస్తాడు. వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కామెంట్స్, ట్వీట్స్ వేస్తారు. ఇక వీరిద్దరినీ బద్నామ్ చేస్తూ సినిమాలు కూడా చేశాడు వర్మ. లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు, పవర్ స్టార్ ఈ తరహా చిత్రాలు. ఈ చిత్రాలలో బాబు, పవన్ పై వర్మ స్పూఫ్ క్యారెక్టర్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ సినిమాలు అటు టీడీపీ, ఇటు జనసేన వర్గాలలో వర్మపై పీకల్లోతు కోపం పెంచుకునేలా చేశాయి.
తాజాగా వర్మ పవర్ స్టార్ కి సీక్వెల్ ప్రకటించాడు. ఆర్జీవీ మిస్సింగ్ టైటిల్ తో ట్రైలర్ విడుదల చేశాడు. ఈ ట్రైలర్ ఆయన పవన్ పై పరోక్షంగా తెరకెక్కించిన పవర్ స్టార్ సినిమాకు సీక్వెల్ అని తెలియజేస్తుంది. బాబుకు, పవన్ కి వ్యతిరేకంగా సినిమాలు చేస్తున్న వర్మను ఎవరో కిడ్నాప్ చేస్తారు. ఈ కిడ్నాప్ వెనుక పవన్ (Pawan kalyan)ఫ్యాన్స్, నారా లోకేష్, మెగా ఫ్యామిలీ హస్తం ఉందని, అనుమానాలు వ్యక్తం అవుతూ ఉంటాయి. మొత్తంగా ఆర్జీవీ మిస్సింగ్ మూవీ కథ ఇది.
లేటెస్ట్ గా వర్మ చంద్రబాబు ఏడుపు ఎపిసోడ్ పై సెటైర్ వేశాడు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న వై ఎస్ జగన్ కఠిన పరిస్థితులలో ఎలా స్పందించాడు, బాబు (Nara chandrababu naidu)ఎలా స్పందించాడో చూపిస్తూ.. జగన్ ని రియల్ హీరోగా, బాబును రీల్ హీరోగా అభివర్ణించాడు. ఇది టీడీపీ, జనసేన వర్గాలలో కాకరేపింది. సదరు వీడియో క్రింద సీఎం జగన్ తో పాటు వర్మపై ఘాటు కామెంట్స్ చేస్తూ తమ కసి తీర్చుకుంటున్నారు.
Also read Bigg Boss Telugu 5 : అత్యంత ఫేక్ పర్సన్ రవి అంటూ సన్నీ స్టేట్‌మెంట్.. శ్రీరామ్ మీదికి రావడంతో హీటెక్కిన హౌజ్
అయితే చంద్రబాబు, పవన్ ని విమర్శిస్తూ స్పూఫ్ సినిమాలు చేసే వర్మ అసలు జగన్ జోలికి ఎందుకు వెళ్లరు. వర్మ వైసీపీ మద్దతుదారుడా? లేక జగన్ (CM jagan) అంటే అభిమానమా? ఒకేవేళ జగన్ వర్మకు డబ్బులు ఇచ్చి ఇలా తన ప్రత్యర్థులపై దాడి చేయిస్తున్నాడా అనే అనుమానాలు చాలా మందిలో నెలకొన్నాయి. దీనికి సమాధానం వర్మ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. జగన్ మేనరిజం, మాటతీరు, బిహేవియర్ స్ట్రాంగ్ గా, సూటిగా ఉంటాయి. అతనిపై కామెడీ, స్పూఫ్ చేయడానికి స్కోప్ ఉండదు, అలాగే ఆలోచనలు రావు. అందుకే నేను జగన్ వ్యక్తిత్వం పై స్పూఫ్స్ చేయను. అంతకు మించి నాకు ప్రత్యేక అభిమానం లేదని అన్నాడు వర్మ. మరి వర్మ మాటల్లో ఎంత వరకు నిజం ఉందో ఆయన ఆత్మ సాక్షికే తెలియాలి.