
అంఖండ సినిమాతో శ్రీకాంత్ మరోసారి వార్తల్లోకి వచ్చారు. అంతేకాదు ఆయనకు సంభందించిన పాత వార్తలు సైతం ఇప్పుడు హైలెట్ అవుతున్నాయి. మీడియాలో,సోషల్ మీడియాలో రన్ అవుతున్నాయి. దాదాపు 20 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతూ విలన్, హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే,ఎంతటి వారికైనా కెరియర్ విషయంలో ఒడిదుడుకులు తప్పవు. అయితే వాటిని ఎదుర్కొని నిలబడాలి. అప్పుడే సక్సెస్ మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. హీరో శ్రీకాంత్ జీవితంలో జరిగిన ఈ ఘటన వింటే మనకీ అదే అనిపిస్తుంది.
ఓ టైమ్ లో శ్రీకాంత్ గతంలో సూసైడ్ చేసుకోవాలి అనుకున్నారట. ఈ విషయాని స్వయంగా ఆయనే తెలిపారు. తన తండ్రితో గొడవపడి సంధర్భంలో ఏకంగా చెరువులో దూకుతానని బెదిరించారట. శ్రీకాంత్ ఒక విషయంలో తప్పు చేసాడట. ఇక అప్పుడు తన తండ్రి వార్నింగ్ ఇచ్చి ఇంటికి రమ్మని పిలిచారట. అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత నన్ను కొడితే నేను చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంటానని తన తండ్రిని బెదిరించానని ఓ ఇంటర్వ్యుల్లో చెప్పుకొచ్చారు శ్రీకాంత్.
గతంలోనూ ఓ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ సోదరి నిర్మల అతని గురించిన ఇలాంటి విషయమే చెప్పుకొచ్చింది. ఒకసారి నాన్నగారు మా కాంతిని కోప్పడ్డారు, సరిగ్గా చదవట్లేదని. అప్పుడు వాడు నాతో ‘నేను లేకపోతే కాని వీళ్లకి నా విలువ తెలియదు’ అంటూ, అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాసేపటికే ఒక కుర్రాడు వచ్చి, ‘మీ తమ్ముడు కాల్వ వైపుగా వెళుతూ కనిపించాడు’ అని చెప్పాడు. అంతకుముందే ఎవరో ఆ కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకున్నారని మా కాంతి విన్నాడు. ఒక్కసారి నా నవనాడులూ కుంగిపోయాయి. పరుగుపరుగున కాల్వ దగ్గరకు వెళితే, వాడు నెమ్మదిగా నడుచుకుంటూ కాల్వ వైపు వెళ్తూ కనిపించాడు. గభాల్న వాడిని పొదివి పట్టుకుని సర్ది చెప్పి ఇంటికి తీసుకువచ్చాను. ఆ రోజున ఎంత టెన్షన్ పడ్డానో, ఇప్పుడు మాత్రం... మా కాంతేనా నన్ను అంత ఇబ్బంది పెట్టింది అనుకుంటాను అన్నారు.
మరోసారి అలాంటి పని చేయకుండా శ్రీకాంత్ ని ఓ కంట కనిపెట్టాలని ఆమెకి తన తల్లి చెప్పిందట. ఈ చిన్ననాటి విషయాలను శ్రీకాంత్ సోదరి బయటకు వెల్లడించారు. ఆ తర్వాత శ్రీకాంత్ కెరీర్ పతన దశలో ఉన్నపుడు మరోసారి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. కానీ.. చిరంజీవి మోటివేషన్ ఆ ఆలోచనలను మార్చుకున్నాడని వార్తలు వచ్చాయి. నిజమెంతో కానీ.... ఆ తర్వాత ఇక వెనుతిరిగి చూసుకోకుండా అంచెలంచెలుగా ఎదిగాడు శ్రీకాంత్.
ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన పీపుల్స్ ఎన్‌కౌంటర్ శ్రీకాంత్‌కు నటుడిగా మొదటి సినిమా. వన్‌బైటు (1993) హీరోగా శ్రీకాంత్ మొట్టమొదటి సినిమా. ఆ తర్వాత వచ్చిన తాజ్‌మహల్ (1995) సినిమా మంచి విజయం సాధించడంతో శ్రీకాంత్ హీరోగా నిలదొక్కుకున్నాడు. ఇక దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్ళి సందడి (1996) చిత్రం శ్రీకాంత్ కెరీర్‌ని అమాంతం మార్చేసిందనే చెప్పాలి. ఒక టైం లో మంచి దశలో టాలీవుడ్ లో టాప్ హీరో గా ఓ రేంజ్లో కి శ్రీకాంత్ ఎదిగాడు . కానీ కొన్ని రోజుల తర్వాత హిట్ లు రాకపోవడం తో హీరో అవకాశాలు తగ్గిపోయి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించే అవకాశాలు పెరిగిపోయాయి. దాంతో హీరో గా చేస్తూనే కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు.
Also read శ్రీకాంత్‌కు అన్యాయం చేసిన బోయపాటి?
ఇక రీసెంట్ గా ఈయన విలన్ గా నటించిన అఖండ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనకు తెలిసిందే. కాబట్టి భవిష్యత్ ఎలా ఉంటుందో తెలియని మనం ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
Also read బాలయ్య కంటే ముందే అఘోరాగా చేసిన చిరు, నాగ్, వెంకీ.. మరి ఆ చిత్రాలు హిట్టా ఫట్టా?