Pushpa: పర్యావరణంపై అల్లు అర్జున్ కి ఎంత ప్రేమో చూశారా.. పుష్ప మేకింగ్ వీడియో

pratap reddy   | Asianet News
Published : Dec 05, 2021, 01:24 PM IST
Pushpa: పర్యావరణంపై అల్లు అర్జున్ కి ఎంత ప్రేమో చూశారా.. పుష్ప మేకింగ్ వీడియో

సారాంశం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్ప' చిత్ర రచ్చ షురూ అయింది. ఇప్పటి వరకు పుష్ప చిత్ర సాంగ్స్, టీజర్స్ బన్నీ లుక్ విషయంలో ఊరిస్తూ వచ్చాయి. అసలు ఇంతకీ పుష్పరాజ్ ఎలా ఉండబోతున్నాడు, ఏం చేయబోతున్నాడు అనే విషయాల్లో క్లారిటీ వచ్చే సమయం దగ్గరపడింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్ప' చిత్ర రచ్చ షురూ అయింది. ఇప్పటి వరకు పుష్ప చిత్ర సాంగ్స్, టీజర్స్ బన్నీ లుక్ విషయంలో ఊరిస్తూ వచ్చాయి. అసలు ఇంతకీ పుష్పరాజ్ ఎలా ఉండబోతున్నాడు, ఏం చేయబోతున్నాడు అనే విషయాల్లో క్లారిటీ వచ్చే సమయం దగ్గరపడింది. సోమవారం రోజు పుష్ప ట్రైలర్ రిలీజ్ కానుంది. ఇప్పటికే పుష్ప చిత్రం పై భారీ అంచనాలు నెలకొని ఉన్న నేపథ్యంలో ఫ్యాన్స్ అంతా ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు. 

తాజాగా Pushpa చిత్ర యూనిట్ మేకింగ్ వీడియో రిలీజ్ చేసింది.  షూటింగ్ లొకేషన్ లో Allu Arjun అద్భుతమైన సందేశంతో మేకింగ్ వీడియో ఉంది. కథ పరంగా పుష్ప చిత్రం ఎక్కువ భాగం అడవుల్లో చిత్రీకరణ జరిగింది. పర్యావరణం బావుండాలంటే అడవులు చాలా కీలకం. పర్యావరణం విషయంలో అల్లు అర్జున్ ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నాడు. 

పుష్ప మేకింగ్ వీడియోలో తన చిత్ర యూనిట్ మొత్తానికి అల్లు అర్జున్ రిక్వస్ట్ చేశాడు. 'నా వైపు నుంచి చిన్న విన్నపం. మనం ఇక్కడ షూటింగ్ జరిపినన్ని రోజులు ప్లాస్టింగ్ కప్పులు, బాటిల్స్, పేపర్లు ఉపయోగించిన తర్వాత ఎవరివి వాళ్ళు తీసుకువచ్చి డస్ట్ బిన్ లో పడేయండి. మనం ఇక్కడకు ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోవాలి అని సూచించి అందరి హృదయాలు గెలుచుకున్నాడు. 

ఇక పుష్ప మేకింగ్ వీడియోలో ఆసక్తిగా ఉంది. దర్శకుడు Sukumar దగ్గరుండి మరీ ప్రతి సన్నివేశాన్ని వివరిస్తున్నారు. అడవుల్లో ఉత్కంఠని రేకెత్తించే యాక్షన్ ఎపిసోడ్స్ ఉండబోతున్నట్లు మేకింగ్ వీడియోలో చూపించారు. అడవులని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా చిత్ర యూనిట్ ఎంతో కష్టపడి కీలక సన్నివేశాలని చిత్రీకరిస్తోంది. ఆ దృశ్యాలని మేకింగ్ వీడియోలో చూడొచ్చు. 

రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అనసూయ, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. రెండు భాగాలుగా తెరక్కుతున్న పుష్ప చిత్రం మొదటి భాగం పుష్ప ది రైజ్ డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Also Read: మరీ ఇంత దారుణంగానా, మలైకా ప్రైవేట్ పిక్ వైరల్.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

Also Read: Pushpa: పుష్పలో అతడిని చంపేది అనసూయేనా.. షాకింగ్ ట్విస్ట్, కిల్లర్ లేడీగా..

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఫ్రెండ్‌తో సినిమా చూసి థియేటర్‌ బయట కన్నీళ్లు పెట్టుకున్న రజనీకాంత్.. జీవితాన్నే మార్చేసిన రోజది
రాజేంద్రప్రసాద్‌ని తొలగించి బ్లాక్‌ బస్టర్‌ కొట్టిన వెంకటేష్‌.. నటకిరీటికి చిరు అన్యాయం చేశాడా?