నానిని నానా మాటలు అన్నారు..ఇప్పుడు వెంకీని వదిలేసారేం?

Surya Prakash   | Asianet News
Published : Nov 13, 2021, 11:16 AM IST
నానిని నానా మాటలు అన్నారు..ఇప్పుడు వెంకీని వదిలేసారేం?

సారాంశం

విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్‌డేట్ వచ్చేసింది. టాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన దృశ్యం సీక్వెల్‌ను ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది.  

ఆ మధ్యన నాని నటించిన టక్ జగదీష్ చిత్రం ఓటీటి రిలీజ్ సమయంలో పెద్ద రచ్చ జరిగింది. ఓటీటిలో రిలీజ్ చేస్తూ థియేటర్స్ ని దెబ్బకొడుతున్నామని అన్నారు.  థియేటర్స్ బాగుంటేనే నిర్మాతలు బాగుంటారు.  ఇలాగే వుంటే ఓటిటీ వైపు వెళ్ళే నిర్మాతలకు తగిన సమాధానం చెపుతాను. హీరోయిజం అంటే థియేటర్ లోనే కనపడుతుంది కానీ.. ఓటిటీలో కనపడదన్నారు.బాహుబలి లాంటి మూవీ ఓటిటిలో రిలీజ్ అయితే ఇంత పేరు వచ్చేదా.. ఓటిటీ వల్ల టాలీవుడ్ కి చాలా నష్టమన్నారు ఇలా నాని ని చాలా టార్గెట్ చేసారు.  

నానికి భవిష్యత్తు ఏంటో చూపిస్తామని.. కేవలం సినిమాల్లోనే హీరో అని… నిజ జీవితంలో పిరికివాడు అంటూ వ్యాఖ్యలు చేశారు.అలాగే నిర్మాతలు తమ సినిమాలను థియేటర్లలో విడుదల చేయకుండా OTT లో స్ట్రీమింగ్ చేయడం ద్వారా సినిమా ఇండస్ట్రీలో ఒక ముఖ్యమైన విభాగాన్ని దెబ్బతీయడంగా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అభిప్రాయపడింది.

 అయితే ఇప్పుడు థియోటర్స్ అన్ని తెరుచుకున్న తర్వాత సురేష్ బాబు ..దృశ్యం 2 చిత్రాన్ని ఓటీటి లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దాంతో సోషల్ మీడియాలో ,మీడియాలో  ఓ ఆసక్తికరమైన డిస్కషన్ మొదలైంది. నానిని టార్గెట్ చేసిన వాళ్ళు ఎవరు ఇప్పుడు దృశ్యం 2 ని థియోటర్ లో రిలీజ్ చేయమేంటని అడగక పోవటం ఆశ్చర్యం అంటున్నారు. సురేష్ బాబుకు భయపడి ఇలా సైలెంట్ అయ్యారా మరికొందరు క్వచ్చిన్ చేస్తున్నారు. ఏదైమైనా ఏ నిర్మాత అయినా ,హీరో అయినా తమ సినిమాని ఓటీటిలో రిలీజ్ చేయాలనుకోరు. కానీ రకరకాల ఈక్వేషన్స్ వారిని ఓటీటి వైపుగా నడిపిస్తాయి. అవి గుర్తుంచుకుంటే చాలు. 

Also read Drushyam 2 Teaser: 6 ఏళ్లుగా వేధిస్తున్న ప్రశ్నలు.. రాంబాబు ఎత్తులే ఎత్తులు.. రిలీజ్‌ సస్పెన్స్ కి తెర

విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్‌డేట్ వచ్చేసింది. టాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన దృశ్యం సీక్వెల్‌ను ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. తాజాగా దృశ్యం-2 టీజర్ రిలీజ్‌ చేసిన మూవీ టీమ్ ఈ నెల 25న అమెజాన్ ప్రైమ్‌లో ఈ క్రైమ్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించింది. ఇక 'రాంబాబు కేసు ఏమైంది?' అంటూ ప్రారంభమైన టీజర్ సినిమాపై ఫుల్ బజ్ క్రియేట్ చేస్తోంది మూవీ టీజర్. ఇదిలా ఉండగా వెంకటేష్ ప్రస్తుతం 'ఎఫ్ 3' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also read ఇంట్లో ఉంటే ఇంకా ఎక్కువ మంది పిల్లలు పుడతారు, కరీనా అంతలా టెంప్ట్ చేస్తోందా!
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Pawan Kalyan: పవన్‌ కళ్యాణ్‌కి సర్జరీ, 2 నెలల్లో మరో ఆపరేషన్‌, అభిమానులే కారణం.. ఇప్పుడు ఎలా ఉన్నారంటే?
Jana Nayagan Censor: 'జననాయగన్' సినిమాకు సెన్సార్ కత్తెర, ఏకంగా 12 సీన్లు కట్.. నిడివి ఎంతంటే?