పవన్ కండీషన్ కు అనీల్ రావిపూడి లాక్ అవుతాడా?

By Surya Prakash  |  First Published Nov 13, 2021, 10:43 AM IST

 పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒకవైపు రీమేక్ సినిమాలు చేస్తూనే మరోవైపు యాక్షన్ పీరియాడికల్ హరిహర వీరమల్లు లాంటి మూవీస్ ని చేస్తున్నాడు. 



పవన్‌కల్యాణ్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘భీమ్లానాయక్‌’ షూటింగ్‌ పూర్తైంది. ‘హరిహర వీరమల్లు’ చాలా వరకూ షూటింగ్‌ పూర్తయింది. ఇక హరీశ్ శంకర్‌ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్‌ సింగ్‌’ కూడా త్వరలోనే పట్టాలెక్కనుంది. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలోనూ పవన్‌ ఓ సినిమా చేయనున్నారు. తాజాగా మరో డైరెక్టర్‌ పవన్‌కు కథ వినిపించారట. యాక్షన్‌ విత్‌ ఎంటర్‌టైనింగ్‌గా కథ చెప్పడంలో అనిల్‌ రావిపూడి స్టైల్ డిఫరెంట్. ఆయన తీసిన గత సినిమాలే అందుకు ఉదాహరణ. ఇప్పుడు తాజాగా ఓ సరికొత్త కథను పవన్‌కు వినిపించారని సమాచారం. కథ విన్న పవన్‌ పాజిటివ్ గా  స్పందించినట్లు తెలుస్తోంది. అయితే, కథ విషయంలో ఓ కండీషన్ పెట్టినట్లు సమాచారం.

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు  పవన్ కళ్యాణ్ స్టోరీ విషయంలో కండిషన్స్ పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హీరోకి భారీ ఎలివేషన్ ఇచ్చే స్క్రిప్ట్‌తో రావద్దని, ఫ్యామిలీలకు నచ్చే అత్తారింటికి దారేది తరహాలో ఫన్ కలిసిన ఎఫ్ 2 లాంటి ఇ ఎంటర్టైన్మెంట్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పినట్టు సమాచారం. తాను వరస సీరియస్ ప్రాజెక్ట్ లు చేస్తున్నాను కాబట్టి ఫన్ స్టోరీ  కావాలని, అలాగే కేవలం యూత్ కు మాత్రమే నచ్చే సబ్జెక్టు వద్దని చెప్పారంటున్నారు.  తన రెగ్యులర్ మాస్ సినిమాలకు భిన్నంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా ఆసక్తికరమైన కామెడీ సినిమా చేయాలని పవన్ భావిస్తున్నారు. అయితే అనీల్ రావిపూడి ఆ తరహా స్టోరీ లైన్ చెప్పారా..పవన్  ఓకే చెప్పారా? లేదా? అన్నది మాత్రం తెలియరాలేదు. దీనిపై త్వరలోనే స్పష్టత రావచ్చు. అన్నీ ఓకే అయితే, దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే పవన్‌తో కలిసి ఆయన ‘వకీల్‌సాబ్‌’ తీశారు.

Latest Videos

undefined

Also read పవన్ కళ్యాణ్ తో నటించడం చాలా ఈజీ: నిత్యా మీనన్

ఇక అనీల్ రావిపూడి వరస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ‘ఎఫ్ 2’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘పటాస్’, ‘రాజా ది గ్రేట్’ వంటి చిత్రాలతో అనిల్ రావిపూడి హీరోలకు,ఫ్యాన్స్ కు తెగ నచ్చేస్తున్నారు.  మరోవైపు పవన్ “భీమ్లా నాయక్” విడుదలకు సిద్ధంగా ఉంది. అనిల్ “F3” చిత్రాన్ని 2022 ఫిబ్రవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.

Also read ప్రభాస్ ఫ్యాన్ సూసైడ్ నోట్... 'నా చావుకు రాధే శ్యామ్ డైరెక్టర్ కారణం'
 

click me!