Bangarraju:'బంగార్రాజు' డైరెక్టర్ ను తెగ తిట్టిన నాగార్జున,ఎందుకంటే

Surya Prakash   | Asianet News
Published : Jan 21, 2022, 05:18 PM IST
Bangarraju:'బంగార్రాజు' డైరెక్టర్ ను తెగ  తిట్టిన నాగార్జున,ఎందుకంటే

సారాంశం

తాజాగా ఆలీతో సరదాగా షో కి గెస్ట్ గా విచ్చేసిన కళ్యాణ్ కృష్ణ కురసాల సినిమా గురించి మాట్లాడుతూ ఒక షాకింగ్ విషయాన్ని తెలియజేశారు. ఒకసారి నాగార్జున ఆయనను పిలిచి చెడామడా తిట్టినట్లు కళ్యాణ్ కృష్ణ చెప్పారు.


సంక్రాంతి కానుకగా మంచి అంచనాల మధ్య బంగార్రాజు సినిమా రిలీజై మంచి హిట్టైంది.  అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన 'బంగార్రాజు' సినిమాకు మార్నింగ్ షో నుంచే  అన్ని ఏరియాల్లో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ‘సొగ్గాడే చిన్న నాయనా’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. తొలి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కలెక్షన్స్ పరంగా ఫస్ట్ డే అదరగొడుతూ ముందుకు సాగుతోంది. ఈ నేపధ్యంలో సినిమాకు ప్రమోషన్ వివిధ టీవి ఛానెల్స్ ద్వారా చేస్తున్నారు. ఈ క్రమంలో   తాజాగా ఆలీతో సరదాగా షో కి గెస్ట్ గా విచ్చేసిన కళ్యాణ్ కృష్ణ కురసాల సినిమా గురించి మాట్లాడుతూ ఒక షాకింగ్ విషయాన్ని తెలియజేశారు. ఒకసారి నాగార్జున ఆయనను పిలిచి చెడామడా తిట్టినట్లు కళ్యాణ్ కృష్ణ చెప్పారు.

కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ... రారండోయ్ వేడుక చూద్దాం" సినిమా చేసే సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నప్పుడు ఒకరిద్దరు తప్పుల వల్ల సినిమా ఆలస్యమైంది. అప్పుడు వాళ్ళ తప్పులను నేను కవర్ చేశాను. నాగార్జున గారు నన్ను పిలిచి వారిని ఎందుకు కవర్ చేస్తావ్, దానివల్ల సినిమా లేట్ అవుతుంది కదా అని అన్నారు" అని చెప్పుకొచ్చిన కళ్యాణ్ కృష్ణ తన తప్పు లేకపోయినప్పటికీ వేరేవాళ్లను కాపాడే ప్రయత్నంలో తనకి తిట్లు పడ్డాయని అన్నారు. ఇక బంగార్రాజు సినిమా ను ముందు నుంచి సంక్రాంతికే విడుదల చేయాలని అనుకున్నారని, అందుకే పరిస్థితులు బాలేకపోయినా ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేశామని చెప్పుకొచ్చారు కళ్యాణ్ కృష్ణ.  
 
ఇక అన్ని ఏరియాల‌కు క‌లిపి 38 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా 39 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. ప్రస్తుతం సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ క్రాస్ చేయడం చాలా ఈజీ అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.  అక్కినేని తండ్రీకొడుకులు నటించిన సినిమా కావడం.. బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్ కావడంతో బజ్ క్రియేట్ అయింది. 'బంగార్రాజు' ప్రమోషనల్ కంటెంట్ కూడా ఫెస్టివల్ కు ఆడియన్స్ కోరుకునే పర్ఫెక్ట్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనుకునేలా చేసింది. ఆ అంచనాలకు తగ్గట్లే సినిమా ఉండటం కలిసొచ్చింది.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ram Charan v/s Pawan Kalyan: పెద్ది మూవీ వాయిదా? బాబాయ్‌ `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` కోసం చరణ్‌ వెనక్కి
Illu Illalu Pillalu Today Episode Jan 24: ఇడ్లీ బాబాయిని చంపేస్తానన్న విశ్వక్, రాత్రికి అమూల్య జంప్?