తన రిలేషన్‌షిప్‌ని బయటపెట్టిన నాని హీరోయిన్‌.. లవ్‌ మ్యారేజ్‌కే గ్రీన్‌ సిగ్నల్‌?

Published : Jan 21, 2022, 04:43 PM IST
తన రిలేషన్‌షిప్‌ని బయటపెట్టిన నాని హీరోయిన్‌.. లవ్‌ మ్యారేజ్‌కే గ్రీన్‌ సిగ్నల్‌?

సారాంశం

నాని హీరోయిన్‌ రుక్సార్‌ దిల్లాన్‌ తన రిలేషన్‌షిప్‌ గురించి ఓపెన్‌ అయ్యింది. తాను రిలేషన్‌పిష్‌లో ఉన్నానని తెలిపి షాకిచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ విశ్వక్‌ సేన్‌తో జోడి కట్టింది. 

నాని(Nani) హీరోయిన్‌ రుక్సార్‌ దిల్లాన్‌(Rukshar Dhillon).. ఓ సీక్రెట్‌ని బయటపెట్టింది. తాను రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు చెప్పింది. అంతేకాదు తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో కూడా చెప్పింది. లేటెస్ట్ గా ఆమె రిలేషన్‌షిప్‌ గురించి ఓపెన్‌ అయ్యింది. `ఆకతాయి` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది బెంగుళూరు బ్యూటీ రుక్సార్‌ దిల్లాన్‌. ఆ తర్వాత నాని హీరోగా నటించిన `కృష్ణార్జున యుద్ధం` చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. నానికి జోడీగా కనిపించి ఆకట్టుకుంది. తనకంటూ ఓ గుర్తింపుని తెచ్చుకుంది. ఈ సినిమా పరాజయం చెందినా.. రుక్సార్‌కి మంచి పేరే వచ్చింది. 

అలాగే అల్లు శిరీష్‌తో `ఏబీసీడీ` చిత్రంలో మెరిసింది Rukshar Dhillon. ప్రస్తుతం యంగ్‌ హీరో విశ్వక్‌సేన్‌తో కలిసి `అశోకవనంలో అర్జున కళ్యాణం` సినిమాలో కథానాయికగా నటిస్తుంది. ముప్పై ఏళ్లు వచ్చిన ఓ వడ్డీ వ్యాపారీ పెళ్లి కోసం పడే పాట్ల నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని, ఇందులో విశ్వక్‌కి జోడీగా రుక్సార్‌ కనిపించబోతుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇందులో ఆమె అందంతో మెస్మరైజ్‌ చేస్తుంది. 

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రుక్సార్‌ ముచ్చటించింది. పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తాను చేసుకోబోయేవాడు ఎలా ఉండాలో చెప్పింది. అంతేకాదు తాను గతంలో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు తెలిపింది. తనని పెళ్లి చేసుకునే వాడు నిజాయితీగా, నిబద్దతతో ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పింది. అయితే పెళ్లి చేసుకునే వ్యక్తి గురించి ముందే అన్ని తెలుసుకోవాలని తెలిపింది. పూర్తిగా అర్థం చేసుకున్నాకే మ్యారేజ్‌ చేసుకుంటానని చెప్పింది. అదే సమయంలో తనకు లవ్‌ మ్యారేజ్‌పై నమ్మకం ఉందని తెలిపింది. మరి గతంలో రిలేషన్‌పిష్‌లో ఉన్న ఈ భామ అతనెవరనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. మరి చూడబోతే ప్రేమ వివాహమే చేసుకునేలా ఉందని అంటున్నారు నెటిజన్లు. 

లండన్‌లో జన్మించిన రుక్సార్‌.. ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చేసింది. అట్నుంచి రుక్సార్‌ ఫ్యామిలీ బెంగుళూరులో సెటిల్‌ అయ్యారు. ప్రస్తుతం బెంగుళూరులో ఉంటున్న ఈ భామ సినిమాలపై ఆసక్తితో 2016లో `రన్‌ ఆంటోని` చిత్రంతో కన్నడలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అట్నుంచి తెలుగులోకి అడుగుపెట్టింది. 2020లో 'భాంగ్రా పా లే' అనే హిందీ సినిమాతో బీటౌన్‌కు కూడా పరిచయమైంది. ప్రస్తుతం విశ్వక్‌సేన్‌తో `అశోకవనంలో అర్జున కళ్యాణం`లో నటిస్తుంది. మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయని టాక్‌. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా
Demon Pavan: తాను విన్నర్ కాదని తెలుసు, రవితేజతో బేరమాడి భారీ మొత్తం కొట్టేసిన డిమాన్ పవన్.. లక్ అంటే ఇదే