Vijay Devarakonda : ఫ్లైట్ లో విజయ్ దేవరకొండ పెట్ .. స్పెషల్ గా ట్రీట్ చేస్తున్న దేవరకొండ బ్రదర్స్..

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 21, 2022, 04:39 PM ISTUpdated : Jan 21, 2022, 04:41 PM IST
Vijay Devarakonda : ఫ్లైట్ లో విజయ్ దేవరకొండ పెట్ ..  స్పెషల్ గా ట్రీట్ చేస్తున్న దేవరకొండ బ్రదర్స్..

సారాంశం

పెంపుడు జంతువుల పట్ల సెలబ్స్ చూపే ప్రేమ అనురాగాలు మాటల్లో చెప్పలేం. వారు ఎక్కడికెళ్లిన వాటిని వెంట తెసుకెళ్తూ ఉంటారు. ప్రత్యేక సౌకర్యాలు కల్పించి, వారి ఇంటి సభ్యుల్లో ఒకరిగా చూసుకుంటారు. అదే తరహాలో విజయ్ దేవరకొండ కూడా తన పెట్ డాగ్ ను  ఫ్లైట్ లో తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.   

విజయ్ దేవరకొండ పేరుకే రౌడీ హీరో.. కానీ మనస్సు మాత్రం వెన్నలాంటిది. ఎందుకంటరా... కుటుంబ సభ్యులనే సరిగా పట్టించుకోని ఈ రోజుల్లో పెంపుడు జంతువులపై కేర్ తీసుకోవడమంటే ఈ బిజీ లైఫ్ లో కొంత కష్టమనే చెప్పాలి. అయితే విజయ్ దేవరకొండ మాత్రం ఎంత బిజీగా తన పెట్ డాగ్ ‘స్టోమ్’ ఆరోగ్యం పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. 

స్పెషల్ గా ట్రీట్ చేస్తూ..  ఇటీవల కాలంలో తాను ఎక్కడికెళ్లినా తనవెంటే తీసుకెళ్తున్నాడు. ఇటీవల తన ప్రయాణంలో భాగంగా స్టోమ్ ను కూడా తన వెంట ఫ్లైట్ లో  తీసుకెళ్లారు దేవరకొండ బ్రదర్స్. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ఇటీవల సోషల్ మీడియాలో ‘దేవరకొండ’ అనే ఖాతాలో పోస్ట్ చేశారు.  ఈ వీడియో చూసిన నెటిజన్లు దేవరకొండ బ్రదర్స్ మానవత్వం చాటుకున్నారంటూ పొగుడుతున్నారు. 

ఈ వీడియోలో దేవరకొండ బ్రదర్స్ రన్నింగ్ ఫ్లైట్ లో ఎదురెదురుగా కూర్చొని ఉంటారు.  అప్పటికే ‘స్టోమ్’ కోసం ప్రత్యేకంగా బుక్ చేసిన సీట్ లో  స్టోమ్ కూడా కూర్చొని ఉంటుంది. ముందుగా ఆనంద్ దేవరకొండ పెట్ ను ముద్దాడుతూ ఉంటాడు. దీంతో  స్టోమ్ కూడా తన ప్రేమను చూపిస్తోంది. వెంటనే విజయ్  స్టోమ్ ను ‘షో యూవర్ అండ్, నాటీ ఫెలో’ అంటాడు. కాసేపు మారం చేసిన స్టోమ్ విజయ్ కి ‘హైఫై’ ఇవ్వడంతో గుడ్ బాయ్ అని మెచ్చుకుంటాడు. 

 

అయితే, స్టోమ్ ఫ్లైట్ ఎక్కడం ఇదే మొదటిసారి అంట. ఈ సందర్భంగా  కాస్త మౌనంగా ఉన్న స్టోమ్ తో బ్రదర్స్ కాసేపు సరదగా ఆడుకున్నారు. ఈ వీడియో పోస్ట్ చేస్తూ ‘దిస్ జెంటిల్ మెన్స్ ఫస్ట్ ప్లేన్ రైడ్’ అంటూ దేవరకొండ బ్రదర్స్ క్యాప్షన్ కూడా పెట్టారు. ఈ వీడియో చూసిన వారు విజయ్, ఆనంద్ తమ స్టోమ్ పట్ల చూపుతున్న ప్రేమకు ఫిదా అవుతున్నారు. కామెంట్లు, లైక్ లతో ఆకాశానికి ఎత్తుతున్నారు. 

ఇక, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ( Puri Jagannath) తెరకెక్కిస్తున్న మూవీ ‘లైగర్’తో విజయ్ దేవరకొండ ప్రేక్షకుల ముుందుకు రానున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. కాగా ఆగస్టులో ఈ మూవీని విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ గతంలో తెలిపిన విషయం తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

Kalyan Padala Remuneration: కళ్యాణ్ పడాల పారితోషికం, ప్రైజ్ మనీ ఎంత? విజేతకు అందే కళ్లు చెదిరే బహుమతులు ఏవో తెలుసా?
Sanjjanaa Galrani: తన హీరోయిన్ సంజనకే ఝలక్ ఇచ్చిన శ్రీకాంత్.. ఎలా ఎలిమినేట్ చేశాడో తెలుసా ?