బూతు చిత్రం ప్రమోషన్ లో కత్తి మహేష్

By Udayavani DhuliFirst Published Jan 4, 2019, 3:30 PM IST
Highlights

కత్తి మహేష్ కు సినిమాల రివ్యూ రైటర్ గా, రాజకీయ విశ్లేషకుడుగా పేరుంది. సోషల్ మీడియాలో ఆయన పెట్టే పోస్ట్ లకు మంచి డిమాండ్ ఉంది. అయితే వాటికి దెబ్బ కొట్టుకునేలా ఆయన ఓ బూతు సినిమాని ప్రమోట్ చేస్తూ అందినీ ఆశ్చర్యపరిచారు. 

కత్తి మహేష్ కు సినిమాల రివ్యూ రైటర్ గా, రాజకీయ విశ్లేషకుడుగా పేరుంది. సోషల్ మీడియాలో ఆయన పెట్టే పోస్ట్ లకు మంచి డిమాండ్ ఉంది. అయితే వాటికి దెబ్బ కొట్టుకునేలా ఆయన ఓ బూతు సినిమాని ప్రమోట్ చేస్తూ అందినీ ఆశ్చర్యపరిచారు. ఏదో చిన్న తెలుగు సినిమా కాస్త ప్రమోషన్ వస్తుందని ప్రమోట్ చేస్తే ఫరవాలేదు...ఓ బూతు డబ్బింగ్ సినిమాకు ఆయన ప్రమోషన్ మొదలెట్టారు. ఓ అడల్ట్ చిత్రం ప్రోమోలో ఆయన కనిపించారు. కేవలం వాళ్లు ముట్టచెప్పే డబ్బులు కోసమే ఈ ప్రమోషన్ చేసారా లేక ఆ నిర్మాతతో పరిచయమే ఈ ప్రమోషన్ కు ఉసిగొల్పిందో తెలియాల్సి ఉంది. 

ఆర్ ఎక్స్ 100,  అర్జున్ రెడ్డి పుణ్యమా అని ..ఇప్పటికే  తెలుగు లో అడల్డ్ సినిమాలు బాగా పెరిగిపోయాయి. ఇవి చాలదన్నట్లు ఇప్పుడు తమిళ అడల్ట్ సినిమాలు సైతం డబ్బింగ్ లతో దిగుతున్నాయి.  తక్కువ బడ్జెట్ తో రొమాన్స్ , ఫన్  కలిపేసి సినిమాగా తెరకెక్కిస్తూ లాభాల బాట పడుతున్నారు. కేవలం టీజర్స్ తోనే సగం పైన లాభాలు రాబట్టుకుంటున్నారంటే అర్ధం చేసుకోవాలి అడల్ట్ కంటెంట్‌ చిత్రాలకు ఎంత డిమాండ్ ఉందో..ఇప్పటికే పలు చిత్రాలు రాగా..తాజాగా మరో చిత్రం రాబోతుంది అదే ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ .

ఈ చిత్రానికి సంబందించిన టీజర్ ‘క్రిటిక్‌’ కత్తి మహేష్‌  సినిమా కథని నేరేట్‌ చేస్తూ కనిపించారు. దాంతో ఈ టీజర్ వైరల్ అయ్యేలా అయ్యింది. టీజర్ మొత్తం అడల్ట్ కంటెంట్ తో నింపేశారు.. చివర్లో కత్తి ‘మూడు రోజులు ఆడే సినిమా.. డిబేట్లు పెట్టి హిట్‌ చేసెయ్యొద్దు..’ అంటూ ఆయనే టీజర్‌కి ముగింపు ఇచ్చాడు. మీరు కూడా ఆ టీజర్ ఫై లుక్ వెయ్యండి.

click me!