భారీ బడ్జెట్ లో మోడీ బయోపిక్..!

Published : Jan 04, 2019, 02:58 PM ISTUpdated : Jan 04, 2019, 03:05 PM IST
భారీ బడ్జెట్ లో మోడీ బయోపిక్..!

సారాంశం

ఫైనల్ గా మోడీ బయోపిక్ లాంచ్ డేట్ ను ఫిక్స్ చేశారు నిర్మాత సందీప్ సింగ్. ఈ సినిమాలో మోడీ పాత్రలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కనిపించబోతున్నాడు.

చాయ్ వాలా నుంచి ప్రధాన మంత్రి వరకు మోడీ వేసిన అడుగులు తెరపై కనిపించబోతున్నాయి. నరేంద్ర మోడీ అంటే వరల్డ్ లో తెలియని వారుండరు. ఎందుకంటే దేశంలో ఏ ప్రధాన మంత్రి చేయని విధంగా ఆయన పర్యటనలు చేశారు. ఇకపోతే ఆయన బయోపిక్ పై గత కొంత కాలంగా అనేక రకాల వార్తలు వస్తున్నాయి. 

ఫైనల్ గా మోడీ బయోపిక్ ను జనవరి 7న లాంచ్ చేయనున్నారు నిర్మాత సందీప్ సింగ్. ఈ సినిమాలో మోడీ పాత్రలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కనిపించబోతున్నాడు. ప్రొడక్షన్ డిజైనర్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకొని డైరెక్షన్స్ లో మేరీ కోమ్ - సారాబ్జీత్ చిత్రాలతో సత్తా చాటిన ఒముంగ్ కుమార్ మోడీ బయోపిక్ కు దర్శకత్వం వహించనున్నారు. 

సినిమాను భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ 100 కోట్లకు పైగానే ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అలాగే స్టార్ నటీనటులు కూడా ఉంటారని సమాచారం. ఇదే నెలలో రెగ్యులర్ షూటింగ్ ను స్టార్ట్ చేసి వీలైనంత త్వరగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవాలని చిత్ర యూనిట్ షెడ్యూల్స్ ను సెట్ చేసుకుంటోంది. మరి మోడీ బయోపిక్ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

Chiranjeevi: చిరంజీవితో నటించి సెలెబ్రిటీలని పెళ్లి చేసుకున్న హీరోయిన్లు వీళ్ళే..సుహాసిని నుంచి జ్యోతిక వరకు
Akhanda 2: అఖండ 2 సంక్రాంతికి వస్తే ఎవరికి నష్టం ? ఒకవైపు ప్రభాస్, మరోవైపు చిరంజీవి.. జరిగేది ఇదే