మద్యానికి బానిసై విచ్చలవిడిగా తిరిగా.. హీరోయిన్ కామెంట్స్!

Published : Jan 04, 2019, 03:21 PM ISTUpdated : Jan 04, 2019, 03:23 PM IST
మద్యానికి బానిసై విచ్చలవిడిగా తిరిగా.. హీరోయిన్ కామెంట్స్!

సారాంశం

నటి మనీషా కొయిరాల తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. కొంతకాలం పాటు క్యాన్సర్ తో పోరాడి గెలిచి మళ్లీ నటిగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. 

నటి మనీషా కొయిరాల తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. కొంతకాలం పాటు క్యాన్సర్ తో పోరాడి గెలిచి మళ్లీ నటిగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.

తన జీవితంలో జరిగిన సంఘటనలను ఓ పుస్తకంగా రాసుకొంది. 'హీల్డ్' అనే పేరుతో రాసిన ఈ పుస్తకంలో ఆమె పలు విషయాలను ప్రస్తావించింది. ఆమెకి క్యాన్సర్ రావడానికి కారణంగా విచ్చలవిడిగా తిరగడం, కట్టుబాట్లను మీరడమేనని అంటోంది మనీషా.

తన చెడు ప్రవర్తన కారణంగానే క్యాన్సర్ బారిన పడినట్లు వెల్లడించింది. ఎన్నో చీకటి రోజులను, ఏకాంత రాత్రులను గడిపినట్లు, వాటి నుండి ఎలా బయటపడ్డానో తలచుకుంటే  చాలా ఆశ్చర్యంగా ఉంటుందని అన్నారు.

మరిన్ని విషయాలను  ప్రస్తావిస్తూ.. ''ఒకప్పుడు ప్రపంచమే నా కాలు కింద ఉందని విర్రవీగాను. క్షణం తీరిక లేని షూటింగ్ ల కారణంగా 1999లో శారీరకంగా, మానసికంగా  బాధపడ్డాను. దానిలో నుండి బయట పడడానికి మద్యం ఒక్కటే మార్గమని భావించాను. స్నేహితులు ఎంతగా హితబోధ చేసినా వినలేదు. క్యాన్సర్ నా జీవితంలో ఒక బహుమతిగానే వచ్చిందని అనుకుంటాను. నా ఆలోచనలు మారాయి. నా దృక్పథంలో మార్పు వచ్చింది. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటున్నాను'' అంటూ చెప్పుకొచ్చింది. 

PREV
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు