ప్రభాస్ సరసన కత్రీనా? పోటీలో దీపిక

Published : May 14, 2017, 01:25 PM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
ప్రభాస్ సరసన కత్రీనా? పోటీలో దీపిక

సారాంశం

బాహుబలి చిత్రంతో బాలీవుడ్ లోనూ ప్రభాస్ కు యమా క్రేజ్ నెక్స్ట్ చిత్రం సాహో లో హీరోయిన్ గా బాలీవుడ్ హీరోయిన్ పోల్ లో కత్రీనాకు మెజారిటీ ఓటేసిన అభిమానులు  

ప్రభాస్‌ పక్కన ఏ పోరి నటిస్తే బాగుంటుంది?’ ఇప్పుడు హైదరాబాద్ నుంచి ముంబయ్‌ మీడియా వరకు డిస్కషన్‌! ‘బాహుబలి’తో ప్రభాస్ ఇమేజ్‌ అమాంతం పెరిగింది. అందువల్ల, సుజీత్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా నటించనున్న ‘సాహో’ను తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో తీయాలని ప్లాన్‌ చేశారు. మన ప్రభాస్‌ ఇప్పుడందరికీ తెలుసు. సో, హీరోయిన్‌గా నలుగురికీ తెలిసిన ఫేస్‌ అయితే బెటర్‌... హిందీ హీరోయిన్‌ అయితే ఇంకా బెటరని ‘సాహో’ టీమ్‌ ఆలోచిస్తోందట! ఇది తెలిసిన ఓ ముంబయ్‌ మీడియా హౌస్‌ ‘ప్రభాస్‌ పక్కన ఏ పోరి నటిస్తే బాగుంటుంది?’ అని ఓ సర్వే నిర్వహించింది.

 

కత్రినా కైఫ్, దీపికా పదుకొనె, ప్రియాంకా చోప్రా, కరీనా కపూర్, కంగనా రనౌత్‌ పేర్లు ఆప్షన్స్‌లో ఇచ్చారు. ప్రభాస్‌కు జోడీగా కత్రినా బాగుంటుందని 49 శాతం, దీపిక బాగుంటుందని 36 శాతం మంది ఓటేశారు. ‘సాహో’ టీమ్‌ మైండ్‌లోనూ వీళ్లిద్దరే ఉన్నారట. ఆల్రెడీ కత్రినాను సంప్రదించారని సమాచారం. మరి ‘సాహో’ టీమ్‌ మైండ్‌లో ఎవరున్నారో! ప్రస్తుతం ప్రభాస్‌ ఫారిన్ టూర్‌లో ఉన్నారు. అతను తిరిగొచ్చిన తర్వాత చిత్రనిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ హీరోయిన్‌ ఎంపికలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

 

ఇప్పటికే మల్లీశ్వరి, అల్లరి పిడుగు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇఖ ప్రభాస్ తో చేస్తే చాలా కాలం తర్వాత మళ్లీ తెలుగు ప్రేక్షకులకు పండగే. మరి ఈ స్థానం కోసం పోటీపడుతున్న దీపిక ఏం చేస్తుందో చూడాలి.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి