నేను ఎప్పుడు రాయలసీమ వచ్చినా ఆ నేల తడుస్తుంది.. ఇంద్ర సెంటిమెంట్‌ గుర్తు చేస్తూ చిరంజీవి ఉత్తేజకర వ్యాఖ్యలు.!

By team teluguFirst Published Sep 28, 2022, 10:30 PM IST
Highlights

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ (Godfather) ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా కొనసాగుతోంది. చిరు మాట్లాడుతూ రాయలసీమతో తనకున్న అనుబంధాన్ని చెబుతూ ఎమోషనల్ అయ్యారు. అయితే వర్షంతో ఈవెంట్ కు కాస్తా అంతరాయం కలిగింది.

మలయాళ సూపర్ హిట్ పొలిటికల్ డ్రామా‘లూసిఫర్’ను తెలుగులో ‘గాడ్ ఫాదర్’గా తెరకెక్కించ బోతున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రధాన  పాత్రలో నటించిన ఈ చిత్రం  ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. దర్శకుడు  మోహన్ రాజా డైరెక్ట్ చేశారు. మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈరోజు ఏపీలో అనంతపురం జిల్లా ఆర్ట్స్ కాలేజీలో గ్రాండ్ గా నిర్వహించారు. చిత్ర యూనిట్ తో పాటు.. నటీనటులు చిరంజీవి, సత్యదేవ్, షఫీ, దర్శకుడు మోహన్ రాజా, గెటప్ శ్రీను  హాజరయ్యారు. ప్రీరిలీజ్ ఈవెంట్ కు మెగా అభిమానులు, సినీ ప్రియులు హోరెత్తారు. 

అయితే ఈవెంట్ పై వర్షం దెబ్బ పడింది. అనంతపురంలో వర్షం కురుస్తున్న సందర్భంగా ఈవెంట్ లో విద్యుదీపాలకు అంతరాయం కలిగింది. చిరంజీవి ఈవెంట్ కు హాజరుకావడం కాస్తా కూడా ఆలస్యం అయ్యింది.  అప్పటికే వర్షం కురుస్తుండటంతో సరిగ్గా  స్టేజీపైకి చిరు మాట్లాడేందుకు రాగా విద్యుత్ కు అంతరాయం కలిగింది. మరోవైపు మెగా అభిమానులు కూడా వర్షాన్ని లెక్కచేయకుండా చిరు స్పీచ్ కోసం వేచి ఉన్నారు. ఈ సందర్భంగా అభిమానుల కోసం మెగాస్టార్ ఏమాత్రం తగ్గకుండా మరింత వైబ్రెంట్ గా స్పీచ్ ను కొనసాగించారు. గొడుగును సైతం పక్కకునెట్టి వర్షంలో తడుస్తూ భావోద్వేగంగా సినిమా గురించి మాట్లాడారు. చిరు మాటలకు ఈవెంట్ ప్రాంగణమంతా అరుపులు, కేకలతో హోరెత్తింది.

చిరు మాట్లాడుతూ.. నేను ఎప్పుడు వచ్చిన రాయలసీమా ఇలా వర్షంతో పులకరించి పోతోంది. నా రాజకీయ పార్టీ ప్రారంభం రోజులనూ ఇక్కడి నుంచే మొదలు పెట్టాను. మళ్లీ ‘గాడ్ ఫాదర్’ ఈవెంట్ సమయంలోనూ వరణుడు ఇలా దర్శనమిచ్చాడు. ‘ఇంద్ర’ సినిమా సమయంలోనూ వరణుడి ఆశీస్సులు మాపై ఉన్నాయి. ఆ వానదేవుడికి ఈ వేదికగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను.’ అంటూ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి స్పీచ్ ప్రారంభానికి ముందు సూపర్ స్టార్ మహేశ్ బాబు తల్లి ఇందిరాదేవి (Indira Devi) మరణానికి ఘన నివాళి అర్పించారు. ఆమెను కోల్పోవడం పట్ల మహేశ్ కుటుంబానికి,   క్రిష్ణకు సానుభూతి వ్యక్తం చేశారు. 

విజయదశమి సందర్భంగా అక్టోబర్ 05న ‘గాడ్ ఫాదర్’ చిత్రాన్ని గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి వచ్చిన అప్డేట్స్ కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది.  ఫస్ట్ సింగిల్ ‘థార్ మార్ థక్కర్ మార్’, సెకండ్ సాంగ్ ‘నజభజ’ సాంగ్ అదిరిపోయాయి. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) కూడా గెస్ట్ రోల్ లో కనిపించనుండటం విశేషం. హీరోయిన్ గా నయనతారా (Nayanthara) ఆడిపాడింది.  కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. థమన్ సంగీతం అందించారు. 

click me!