
కొత్త సినిమాల రిలీజ్ కు హీరోలకు కటౌట్లు కడుతూండటం రెగ్యులర్ గా అభిమానులు చేసేదే. మల్టీప్లెక్స్ కల్చర్ ఎంతగా పెరిగినా కూడా థియేటర్స్ ముందు ఆ కటౌట్స్ లేకపోతే సినిమా అస్సలు చూసినట్లు ఉండదు అంటారు అభిమానులు. అందుకే ఇప్పటికీ ఇదే ట్రెండ్ ఫాలో అయిపోతున్నారు. అందులోనూ ఇప్పుడు కటౌట్స్ కు సోషల్ మీడియాలో మంచి ఆదరణ ఉంది. ఆ ఫ్యాన్స్ ని ఎక్కడెక్కడి ఫ్చాన్స్ మెచ్చుకుంటూంటారు. అయితే ఈ కటౌట్స్ లో కూడా గిన్నీస్ రికార్డ్ చేయాలనేది కొందరు అభిమానులు ఆలోచన.
హైదరాబాద్ ప్రభాస్ అభిమానలు తమ హీరో పుట్టిన రోజుకు ఏదో ఒక విభిన్నమైన పని చేసి విషెష్ తెలపాలి అనుకుంటున్నారు. అందులో భాగంగా ఓ భారీ కటౌట్ ని పెట్టాలని, అదీ గిన్నీస్ రికార్డ్ క్రియేట్ చేసేలా చెయ్యాలనేది వీరి ఆలోచనట. ఇందుకోసం వారు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఖర్చు ఎంతైనా సరే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారట. తమ హీరో తాజా చిత్రం ఆదిపురుష్ కు చెందిన కటౌట్ పెట్టించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వినికిడి. అయితే ఇందుకు ఫర్మిషన్స్ వస్తాయా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
మరో ప్రక్క ఈ కటౌట్ ఎంత ఉండాలి గిన్నీస్ రికార్డ్ కు ఎక్కాలంటే అనే చర్చ సైతం జరుగుతోంది. గతంలో తమిళ స్టార్ హీరో సూర్యకు ఏకంగా 215 అడుగుల కటౌట్ పెట్టారు ఫ్యాన్స్. సూర్య ఫెయిల్యూర్ చిత్రం ఎన్జీకే సినిమాకు ఈ కటౌట్ పెట్టారు. ఐదు ఫ్లాఫ్ ల తర్వాత వచ్చిన ఈ సినిమా విడుదలను పండగలా చేసుకున్నారు సూర్య ఫ్యాన్స్. పొలిటికల్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు సెల్వ రాఘవన్. అయితే ఈ సినిమా వర్కవుట్ కాలేదు.
ఇక అసలు విషయానికి వస్తే మినిమం 220 అడుగులు అయినా కటౌట్ ఉంటేనే ..గిన్నీస్ ఎక్కుతుందని అంటున్నారు. ఏదమైనా ఇలాంటి కటౌట్ పెడితే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోతుందిది. ప్రభాస్ ను చూసి ఫ్యాన్స్ వెర్రెత్తిపోవటం ఖాయం.ఆ మధ్య సర్కార్ సినిమా విడుదల సమయంలో కూడా విజయ్ కోసం భారీ కటౌట్ ఏర్పాటు చేసారు ఫ్యాన్స్. ఇప్పుడు ప్రభాస్ కు కూడా ఇదే చేయబోతున్నారు. అందుకే అంటారు.. అభిమానులందు ప్రభాస్ అభిమానులు వేరయా అని.