దుమ్మురేపుతున్న `గాడ్‌ ఫాదర్‌` ట్రైలర్‌.. మెగాస్టార్‌ విశ్వరూపం.. ఫ్యాన్స్ కి పూనకాలే!

Published : Sep 28, 2022, 08:23 PM ISTUpdated : Sep 28, 2022, 08:56 PM IST
 దుమ్మురేపుతున్న `గాడ్‌ ఫాదర్‌` ట్రైలర్‌.. మెగాస్టార్‌ విశ్వరూపం.. ఫ్యాన్స్ కి పూనకాలే!

సారాంశం

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా, సల్మాన్‌ ఖాన్‌ కీలక పాత్రలో నటించిన `గాడ్‌ ఫాదర్‌` చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. ఈ సాయంత్రం రిలీజ్‌ అయిన ట్రైలర్‌ దుమ్ములేపుతుండటం విశేషం.

`నేను రాజకీయాలకు దూరంగా ఉన్నానేమో.. కానీ నా నుంచి రాజకీయం దూరం కాలేద`ని మరోసారి తేల్చి చెప్పాడు మెగాస్టార్‌ చిరంజీవి. తాజాగా ఆయన నటిస్తున్న `గాడ్ ఫాదర్‌` చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. మోహన్‌ రాజా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం దసరా కానుకగా విడుదల కాబోతున్న నేపథ్యంలో బుధవారం అనంతపూరంలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా `గాడ్‌ ఫాదర్‌` సాయంత్రం ఎనిమిది గంటలకు ట్రైలర్‌ని విడుదల చేశారు. చిరంజీవి సోషల్‌ మీడియా ద్వారా ట్రైలర్‌ని షేర్‌ చేశారు. 

విజయదశమికి థియేటర్లో కలుద్దాం అంటూ ఆయన పంచుకున్న ట్రైలర్‌ దుమ్మురేపుతుంది. ఇందులో బ్రహ్మా అనే పాత్రలో చిరంజీవి కనిపించబోతున్నారు. `మంచోళ్లంతా మంచోళ్లు కాదు. చాలా డ్రామాలు జరుగుతున్నాయి వెనక. అన్ని రంగులు మారతాయి. సీఎం అవ్వడానికి అన్ని పాజిబులిటీస్‌ ఉన్న వ్యక్తి.. మోస్ట్ డేంజరస్‌ మిస్టీరియస్‌ మ్యాన్‌ బ్రహ్మా` అంటూ పూరీ జగన్నాథ్‌ వాయిస్‌ ఓవర్‌తో ట్రైలర్‌ ప్రారంభమైంది. 

చిరంజీవి మార్క్ స్టయిల్‌, యాక్షన్‌, పవర్‌ ఫుల్‌ డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి. అదరగొడుతున్నాయి. చిరుకి డైలాగులు తక్కువే అయినా, బ్యాక్‌ గ్రౌండ్‌ వాయిస్‌తో ఆయన పాత్ర ఎంత శక్తివంతంగా ఉంటుందో తెలియజేశారు. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్‌ అదరగొడుతుంది. ఇందులో `నేను రాజకీయాలకు దూరంగా ఉన్నానేమో.. కానీ నా నుంచి రాజకీయం దూరం కాలేద`ని చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంటుంది. ఇటీవల ఇదే డైలాగ్‌ని చిరంజీవి పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో రాజకీయంగా అది చర్చనీయాంశమైంది. తాజాగా ఇది సినిమాలోని డైలాగ్‌ అని స్పష్టమవుతుంది.

మరోవైపు సల్మాన్‌ ఖాన్‌తో కలిసి ఆయన చేసే యాక్షన్‌ నెక్ట్స్ లెవల్‌లో ఉందని చెప్పొచ్చు. మరోసారి చిరు మాస్‌ మేనియాని ఈ చిత్రంలో చూడొచ్చని ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతుంది. అదే సమయంలో చివర్లో `కేజీఎఫ్‌ 2`, `విక్రమ్‌` సినిమాల తరహా యాక్షన్‌ సీన్లు కనిపించడం ఫ్యాన్స్ కి సర్‌ప్రైజింగ్‌ అని చెప్పొచ్చు. సల్మాన్‌ ఎంట్రీ గూస్‌ బంమ్స్ తెప్పిస్తుంది. ఇది సినిమాకే హైలైట్‌గా ఉంటుందని తెలుస్తుంది. ఈ దసరాకి మెగా ఫ్యాన్స్ కి బెస్ట్ ట్రీట్ లా ఉండబోతుందని అర్థమవుతుంది. 

ఇది మలయాళ చిత్రం `లూసీఫర్‌`కి రీమేక్‌ అనే విషయం తెలిసిందే.  మోహన్‌ రాజా దర్శకత్వం వహిస్తున్న `గాడ్‌ ఫాదర్‌`లో  సల్మాన్‌ ఖాన్‌ ముఖ్య పాత్ర పోషించగా, నయనతార, సత్యదేవ్‌ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఆర్‌బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం తెలుగుతోపాటు హిందీ, మలయాళంలోనూ అక్టోబర్ 5న విడుదల కాబోతుంది. ఇప్పటికే సినిమాకి సంబంధించిన టీజర్‌, రెండు సాంగ్స్ విడుదలై ఆకట్టుకున్నాయి. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

నమ్రత ఎంత చెప్పినా వినకుండా డిజాస్టర్ చూసిన మహేష్ బాబు ? ఆ సినిమా చేసి తప్పు చేశాడా?
Eesha Rebba: డైరెక్టర్‌ని పెళ్లి చేసుకోబోతున్న ఈషా రెబ్బా.. అసలు కథ ఇప్పుడే స్టార్ట్