డిప్రెషన్ లోకి వెళ్లిన నాకు చిరంజీవి ధైర్యం చెప్పారు- శ్రీకాంత్

Published : Jul 16, 2021, 12:54 PM IST
డిప్రెషన్ లోకి వెళ్లిన నాకు చిరంజీవి ధైర్యం చెప్పారు- శ్రీకాంత్

సారాంశం

హీరోగా ఫార్మ్ లో ఉన్న సమయంలో శ్రీకాంత్ ఈ ఏడాది ఏడు సినిమాలు విడుదల చేశారట. ఏడు సినిమాల్లో ఒక్కటి కూడా విజయం సాధించలేదట. దీనితో శ్రీకాంత్ తీవ్ర మానసిక వేదనకు గురయ్యారట. 

ఫ్యామిలీ చిత్రాల హీరోగా శ్రీకాంత్ ఒకప్పుడు చాలా బిజీ. ఏడాదికి ఐదు నుండి ఆరు చిత్రాల వరకు ఆయన చేసేవారు. పెళ్లి సందడి శ్రీకాంత్ కెరీర్ లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అప్పట్లో పెళ్లి సందడి ఓ సంచలనం. హీరోగా శ్రీకాంత్ కి అవకాశాలు తగ్గగా, విలన్ గా, క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. కాగా ఓ దశలో శ్రీకాంత్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయారట. హీరోగా నా కెరీర్ ముగిసినట్లేనా అని వేదన పడ్డారట. 

హీరోగా ఫార్మ్ లో ఉన్న సమయంలో శ్రీకాంత్ ఈ ఏడాది ఏడు సినిమాలు విడుదల చేశారట. ఏడు సినిమాల్లో ఒక్కటి కూడా విజయం సాధించలేదట. దీనితో శ్రీకాంత్ తీవ్ర మానసిక వేదనకు గురయ్యారట. నా సినిమాలు ప్రేక్షకులకు నచ్చడం లేదా అని భయపడ్డారట. చివరికి సొంత ఊరికి కూడా తిరిగి వెళ్లిపోవాలని అనుకున్నారట. ఆ సమయంలో చిరంజీవి తనకు మద్దతుగా నిలిచి ధైర్యం చెప్పారట. 

తాజా ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు శ్రీకాంత్. ఇక హీరో శ్రీకాంత్ కొడుకు హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయన హీరోగా పెళ్లి సందడి మూవీ తెరకెక్కుతుంది. ఇక బాలయ్య అఖండ మూవీలో శ్రీకాంత్ విలన్ రోల్ చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Srinivasa Mangapuram 5 Days Collections: శ్రీనివాస మంగాపురంకి షాకింగ్‌ కలెక్షన్లు.. మహేష్‌ అన్న కొడుక్కి ఇది ఊహించలేం
Newtons 3rd Law 4 Days Collections: సుమంత్‌ మూవీకి దారుణమైన కలెక్షన్లు.. కనీసం హీరో రెమ్యూనరేషన్‌ కూడా రాలేదా?