ఛత్రపతి హిందీ రీమేక్ లాంఛ్, ముఖ్య అతిథిగా రాజమౌళి

Published : Jul 16, 2021, 11:37 AM IST
ఛత్రపతి హిందీ రీమేక్ లాంఛ్, ముఖ్య అతిథిగా రాజమౌళి

సారాంశం

ఛత్రపతి హిందీ రీమేక్ కి వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. పెన్ స్టూడియోస్ పతాకంపై జయంతి లాల్ గడా నిర్మిస్తున్నారు. రచయిత విజయేంద్ర ప్రసాద్ హిందీ నేటివిటీకి తగ్గట్టుగా ఛత్రపతి స్క్రిప్ట్ ని మార్చడం జరిగింది. 

యాక్షన్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యారు. తెలుగులో భారీ విజయం సాధించిన ఛత్రపతి హిందీ రీమేక్ లో ఆయన నటిస్తున్నారు. నేడు ఈ మూవీ లాంఛింగ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ముఖ్య అతిథిగా రాజమౌళి విచ్చేశారు. బెల్లంకొండ శ్రీనివాస్ పై ఆయన క్లాప్ కొట్టడం జరిగింది. 

ఛత్రపతి హిందీ రీమేక్ కి వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. పెన్ స్టూడియోస్ పతాకంపై జయంతి లాల్ గడా నిర్మిస్తున్నారు. రచయిత విజయేంద్ర ప్రసాద్ హిందీ నేటివిటీకి తగ్గట్టుగా ఛత్రపతి స్క్రిప్ట్ ని మార్చడం జరిగింది. ఆయన కూడలి లాంఛింగ్ ఈవెంట్ కి హాజరయ్యారు. 

సాయి శ్రీనివాస్ చిత్రాల హిందీ వెర్షన్స్ ని బాలీవుడ్ ప్రేక్షకులు చాలా ఇష్టపడతారు. తెలుగు ప్లాప్ గా నిలిచిన చిత్రాలు సైతం హిందీ వర్షన్స్  యూట్యూబ్ లో విశేష ఆదరణ దక్కించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఛత్రపతి సినిమాతో సాయి శ్రీనివాస్ బాలీవుడ్ లో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు. 

2005లో ప్రభాస్ హీరోగా విడుదలైన ఛత్రపతి భారీ విజయం అందుకుంది. దర్శకుడు రాజమౌళి ఏ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. రాజమౌళి చిత్రానికి వివి వినాయక్ దర్శకత్వం వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

PREV
click me!

Recommended Stories

Nagarjuna: కోడలు శోభితా ప్రెగ్నెన్సీపై నాగార్జున రియాక్షన్‌ ఇదే, తాత కావడంపై హింట్‌.. రూ.2కోట్ల విరాళం
Karthika Deepam 2 Today Episode: వైరాతో చేతులు కలిపిన జ్యోత్స్న- శ్రీధర్ ని కార్తీక్ కాపాడుతాడా?