ఆ సినిమా కారణంగా అప్పులపాలైన రోజా!

Published : Jun 23, 2021, 03:15 PM IST
ఆ సినిమా కారణంగా అప్పులపాలైన రోజా!

సారాంశం

 ఓ దశలో రోజా సర్వం కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారట. 1994లో సుమన్ హీరోగా రోజా హీరోయిన్ గా సెల్వమణి దర్శకత్వంలో అతిరథి పడై అనే చిత్రం తెరకెక్కించారు. ఈ సినిమాకు రోజానే నిర్మాత. 


ప్రస్తుతం రోజా కెరీర్ సక్సెస్ ట్రాక్ లో ఉంది. అధికార వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న రోజా ఏపిఐఐసీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. అలాగే జబర్దస్త్ షో జడ్జిగా కొనసాగుతున్నారు. స్టార్ హీరోయిన్ గా తెలుగు, తమిళ బాషలలో వందకు పైగా సినిమాలు చేస్తారు రోజా. ఒకప్పటి ఈ స్టార్ హీరోయిన్ 2002లో దర్శకుడు సెల్వమణిని ప్రేమ వివాహం చేసుకున్నారు. 


అయితే ఓ దశలో రోజా సర్వం కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారట. 1994లో సుమన్ హీరోగా రోజా హీరోయిన్ గా సెల్వమణి దర్శకత్వంలో అతిరథి పడై అనే చిత్రం తెరకెక్కించారు. ఈ సినిమాకు రోజానే నిర్మాత. తెలుగులో సమరంగా విడుదలైన ఈ మూవీ అనుకున్నంత విజయం సాధించలేదు. సమరం మూవీ ప్లాప్ కావడంతో రోజా అప్పులపాలు అయ్యారట. 


ఆ సినిమా మిగిల్చిన నష్టాల నుండి బయటికి రావడానికి చాలా కాలమే పట్టిందట రోజాకు. హీరోయిన్ గా సంపాదించుకున్న డబ్బులు అన్ని పోగొట్టుకున్నారట రోజా.  సినిమాలలో నటించడం ద్వారా ఆ అప్పులు తీర్చి మరలా ట్రాక్ లో పడ్డారట ఆమె. ఆ విధంగా నిర్మాతగా మారి ఇబ్బందులు పాలయ్యారు నటి రోజా. 
 

PREV
click me!

Recommended Stories

Actor Ravi Mohan: డైరెక్టర్ కాకముందే విలన్‌గా రవి మోహన్.. షాకింగ్ రెమ్యూనరేషన్
Sudha Kongara: పరాశక్తి డైరెక్టర్ సుధా కొంగర నెక్స్ట్ మూవీ.. స్టార్ హీరో కొడుకుతో భారీ ప్లాన్ ?