మాస్‌బీట్‌తో దళపతి విజయ్‌పై అభిమానాన్ని చాటుకున్న కీర్తిసురేష్‌..

Published : Jun 23, 2021, 02:34 PM IST
మాస్‌బీట్‌తో దళపతి విజయ్‌పై అభిమానాన్ని చాటుకున్న కీర్తిసురేష్‌..

సారాంశం

 విజయ్‌ పుట్టిన రోజు సందర్భంగా అనేక తారలు విషెస్‌ తెలిపారు. మహానటి కీర్తిసురేష్‌ కూడా బర్త్ డే విషెస్‌ తెలిపింది. కానీ విజయ్‌పై తనకున్న ప్రత్యేకమైన అభిమానాన్ని చాటుకుంది. 

దళపతి విజయ్‌పై మరోసారి తన అభిమానాన్ని చాటుకుంది `మహానటి` కీర్తసురేష్‌. మంగళవారం విజయ్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అనేక తారలు విషెస్‌ తెలిపారు. మహానటి కీర్తిసురేష్‌ కూడా బర్త్ డే విషెస్‌ తెలిపింది. కానీ విజయ్‌పై తనకున్న ప్రత్యేకమైన అభిమానాన్ని చాటుకుంది. విజయ్‌ నటించిన `మాస్టర్‌` చిత్రంలోని ఇంట్రడక్షన్‌ మాస్‌ బీట్‌ సాంగ్‌కి స్టెప్పులేసింది. డాన్సర్‌తో కలిసి కీర్తిసురేష్‌ మాస్‌ డాన్స్ చేసింది. మామూలుగా కాదు, అదిరిపోయేలా చేసింది. విజయ్‌కి బర్త్ డే గిఫ్ట్ గా ఇచ్చింది. 

తాను విజయ్‌కి గొప్ప అభిమానని తెలిపింది కీర్తిసురేష్‌. ప్రస్తుతం కీర్తిసురేష్‌ చేసిన డాన్స్‌ వీడియోని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోగా అది వైరల్‌ అవుతుంది. అయితే విజయ్‌పై కీర్తికి ఇలా రేంజ్‌లో అభిమానం ఉండటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇప్పుడే కాదు, గతేడాది కూడా కీర్తిసురేష్‌ ఇలాంటి విజయ్‌కి మంచి గిఫ్ట్ ఇచ్చింది. అప్పుడు గిటార్‌ వాయిస్తూ బర్త్ డే విషెష్‌ చెప్పింది. జీవితం చాలా చిన్నదని, ప్రతి క్షణం ఎంజాయ్‌ చేయాలని, ఆనందంగా గడపాలని చెబుతూ, విజయ్‌ సర్‌ మీకు చిన్న ట్రిబ్యూట్‌` అంటూ ఈ వీడియోని షేర్‌ చేసింది. 

కీర్తిసురేష్‌.. విజయ్‌తో కలిసి రెండు సినిమాల్లో నటించింది. 2017లో `భైరవ` చిత్రంలో మొదటి నటించి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత `సర్కార్` చిత్రంలోనూ నటించింది. ఈ లెక్కన మరోసారి ఈ అమ్మడికి విజయ్‌ ఆఫర్‌ ఇచ్చినా ఇస్తాడేమో చూడాలి. ప్రస్తుతం కీర్తిసురేష్‌ తెలుగులో `సర్కారు వారి పాట`, `గుడ్‌లక్‌ సఖీ`, తమిళంలో `అన్నాత్తే`, `సాని కయిధమ్‌`, మలయాళంలో `వాసి`, `మరక్కర్‌` చిత్రాల్లో నటిస్తుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

జైలర్ 2 లో తమన్నాకి నో ఛాన్స్.. రజినీకాంత్ తో ఐటెం సాంగ్ లో స్టెప్పులేయబోతున్న బ్యూటీ ఎవరో తెలుసా ?
చిరంజీవి ఫ్రెండ్ తో లవ్ ఎఫైర్ పెట్టుకున్న స్టార్ హీరోయిన్ ? పెళ్లి కాకుండా ఒంటరిగా మిగిలిపోయింది