
సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో సినిమా చెయ్యాలని స్టార్స్ అందరికీ ఉంటుంది. వారిలోని నటనను బయిటకు తీసుకువచ్చి పాపులర్ చేసే సుకుమార్ అంటే అందరికీ ఇష్టం. అందులోనూ పుష్ప చిత్రంతో సుకుమార్ క్రేజ్ నెక్ట్స్ లెవిల్ కు వెళ్లిపోయింది. కానీ సుకుమార్ చాలా ఆచి,తూచి అడుగులు వేస్తున్నారు. తన లెక్కలు తాను వేసుకుని కెరీర్ ని ముందుకు తీసుకెళ్తున్నారు. పుష్ప పార్ట్ 2 ఫస్ట్ లుక్, గ్లింప్స్ విడుదల అవుతున్న ఈ సమయంలో మరోసారి సుకుమార్ నెక్ట్స్ చేయబోయే సినిమాల ప్రస్తావన మొదలైంది.
‘పుష్ప 2’ తర్వాత సుకుమార్ ఏ సినిమా చేయబోతున్నారు? చాలా రోజులుగా ఈ ప్రశ్న వినిపిస్తోన్న విషయమే. సుకుమార్ లెక్కల్లో ఇద్దరు హీరోలున్నారు. ఒకరు రామ్‌చరణ్ అయితే, రెండో హీరో విజయ్ దేవరకొండ. చరణ్ సినిమాకు సంబంధించి ఓ సీన్ కూడా షూట్ చేశారు అనేది రాజమౌళి ఆ మధ్య చెప్పిన మాట. విజయ్ సినిమా అనౌన్స్‌మెంట్ కూడా అయ్యింది. దీంతో ఈ ఇద్దరిలో ఒకరితో సినిమా ఉండొచ్చు అని అనుకుంటున్నారంతా.
వాస్తవానికి విజయ్ దేవరకొండ కాంబినేషన్లో ఓ సినిమా రానున్నట్లు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేవరకొండ నటిస్తున్న ‘ఖుషీ’ సినిమా తర్వాత ఈ చిత్రం పట్టాలెక్కుతుందని ప్రచారం జరిగింది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ భిన్నమైన వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది. సుకుమార్- విజయ్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందని.. ప్రస్తుతం లవ్ స్టోరీస్ తెరకెక్కించడానికి సుకుమార్ ఆసక్తి చూపడం లేదని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. పుష్ప తర్వాత తాను మీడియం బడ్జెట్ చిత్రాలకు దర్శకత్వం వహించడానికి సుక్కు సిద్ధంగా లేరని చెప్తున్నారు.
అలాగే సుకుమార్ తదుపరి ప్రాజెక్ట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేయనున్నారట. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘ రంగస్థలం’ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. . ‘రంగస్థలం’ చరణ్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. దాంతో చరణ్ తో మరో చిత్రం చేయటానికి స్క్రిప్టు కూడా రాసారని, ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో గ్లోబుల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ తో సినిమా అయితే తనకు ఫెరఫెక్ట్ అని ఆయన భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే పుష్ప వంటి అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ చిత్రం తర్వాత మళ్లీ అలాంటి సినిమా చేయరని, మధ్యలో ఓ లవ్ స్టోరీ చేసి గ్యాప్ తీసుకునే మరో యాక్షన్ మాస్ సినిమా చేస్తారని కాబట్టి విజయ్ దేవరకొండ సినిమా పూర్తయ్యాకే చరణ్ చిత్రం ఉంటుందని ఓ వర్గం ఉంటోంది. సుకుమార్ రైటింగ్స్ నుంచి వినిపిస్తున్న వార్త ప్రకారం.. సుక్కు నెక్ట్స్ చరణ్‌తోనే చేయాలనుకుంటున్నారట. ఆ తర్వాతనే విజయ్ దేవరకొండతో ఉంటుందని సమాచారం. ఇది తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో సాగే లవ్ స్టోరీ అని, తన స్టయిల్‌లో ఉంటుందని, దీన్ని కూడా లావిష్‌గానే ప్లాన్ చేస్తున్నారట. అయితే కాలం మారే కొద్ది కాలుక్యూలేషన్స్ మారతాయి. ఈ క్రమంలో అటుది ఇటైనా, ఇటుది ఆటైనా, ఈవన్నీ కాక కొత్తది వచ్చినా ఆశ్చర్యం లేదు. మరోవైపు తన `సుకుమార్ రైటింగ్స్` ని కూడా ఎక్స్ పాన్షన్ చేసే ఆలోచనలో సుకుమార్ ఉన్నట్టు సమాచారం.
ఇవన్నీ ప్రక్కన పెడితే ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప ది రూల్’ పైనే సుకుమార్ పూర్తి దృష్టి ఉంది. ఉన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత మాత్రమే తన నెక్ట్స్ సినిమా గురించి ఆలోచనలు చేయనున్నట్లు తెలుస్తోంది. అప్పటిదాకా ఆయన ఈ విషయాలపై మాట్లాడటానికి కూడా ఇష్టపడటం లేదట. అయితే తమ హీరోతో సుకుమార్ చేస్తాడా లేదా అనేది ఫ్యాన్స్ కే టెన్షన్ గా ఉంది. వాళ్లే సోషల్ మీడియాలో డిస్కషన్ మొదలెట్టారు