
'ఆర్ఆర్ఆర్' సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌తో రామ్ చరణ్.. మెగా పవర్ స్టార్ కాస్త గ్లోబల్ స్టార్‌గా మారిపోయారు. ఈ సినిమాలో ఆయన పాత్రకు మెస్మరైజ్ అయిన అభిమానులు.. చరణ్ నెక్ట్స్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అలాగే ఈ లోగా పాత సినిమాలను ఆదరిస్తున్నారు. ఇటీవలే ఆరెంజ్ సినిమాకు వచ్చిన రెస్పాన్సే ఇందుకు ఉదాహరణ. మొన్న మొన్నటి దాకా ఆర్ఆర్ఆర్కు అవార్డుల వెల్లువ కొనసాగడం వల్ల ఆ పనుల్లో బిజీ అయిపోయారు చరణ్. ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'గేమ్ చేంజర్' సినిమాలో నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో కియారా హీరోయిన్ పాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. అయితే ఇప్పుడు సంక్రాంతికి వచ్చే అవకాసం లేదంటోంది ట్రేడ్.
రామ్ చరణ్ పుట్టిన రోజున గేమ్ ఛేంజర్ టైటిల్ అండ్ లుక్ ఇచ్చారు. కానీ గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ఇవ్వకుండా ఫాన్స్ ని డిస్పాయింట్ చేసారు. అయితే గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ప్లాన్ చేంజ్ అవడానికి కారణం రిలీజ్ డేట్ విషయంలో ఉన్న డైలమో అని తెలుస్తోంది. అందుకు కారణం చరణ్ అని అంటున్నారు. రామ్ చరణ్ తన భార్య ఉపాసన డెలివరీ కోసం ఓ నెల షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చి అమెరికా వెళ్ళబోతున్నాడని, అందుకే రామ్ చరణ్ అందుబాటులో లేకపోతె గేమ్ ఛేంజర్ డేట్ ఇచ్చి ఇరుకునపడతామని శంకర్ , దిల్ గాజులు భావించారట. రామ్ చరణ్ అయితే కొద్దిరోజులపాటు భార్య డెలివరీ కోసం అమెరికా వెళ్లనున్నారు. ఇప్పటికే ఉపాసన అమెరికాలో ఓ ఇల్లు కూడా రెంట్ కి తీసుకుంది అని, ఆస్కార్ కోసం వెళ్ళినప్పుడే ఉపాసన-చెర్రీ ఆ ఇంట్లోనే స్టే చేసినట్లుగా కొన్నిమీడియా ఛానల్స్ కథనాలు ప్రసారం చేసాయి కూడా.
ఇక రామ్ చరణ్-శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సెట్స్ నుండి శంకర్ రీసెంట్ గానే కమల్ హాసన్ ఇండియన్ 2 సెట్స్ లోకి వెళ్ళినట్టుగా ట్వీట్ చేసారు. తైవాన్ లో ఇండియన్ 2 కొత్త షెడ్యూల్ మొదలు కాబోతున్నట్టుగా శంకర్ అప్ డేట్ ఇచ్చారు. ఈ గ్యాప్ లో రామ్ చరణ్ భార్య ఉపాసనతో దుబాయ్ వెళ్ళిపోయాడు. అక్కడ కొద్దిరోజులు గడిపి రామ్ చరణ్ మళ్ళీ గేమ్ ఛేంజర్ షూటింగ్ లోకి ఎంటర్ అవుతాడు.
ఇక గేమ్ ఛేంజర్ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేద్దామనుకుంటే.. ప్రభాస్ ప్రాజెక్ట్ కె, మహేష్ బాబు ఎస్ఎస్ఎంబీ 28 రేసులో ఉన్నాయి. అలాగని సమ్మర్‌కు వెళ్తే.. మరింత లేట్ అయ్యే ఛాన్స్ ఉంది. దాంతో ప్రస్తుతం గేమ్ ఛేంజర్ టీమ్ రిలీజ్ డేట్ పై కాస్త గట్టిగానే కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరో ప్రక్క ఈ సినిమాను ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారనే వార్త హల్ చల్ చేస్తోంది. డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం శంకర్, గేమ్ ఛేంజర్‌తో పాటు ఇండియన్ 2 కూడా తెరకెక్కిస్తున్నాడు. డిసెంబర్‌లో చరణ్ మూవీ రిలీజ్ చేసి.. సమ్మర్‌లో ఇండియన్ 2 రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడట శంకర్. త్వరలోనే గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ పై క్లారిటీ రానుందని అంటున్నారు.
ఇక శంకర్ ఈ సినిమాను పవర్ ఫుల్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు. తండ్రి కొడుకులుగా చరణ్ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌లో అల్ట్రా మోడ్రన్ లుక్‌లో స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు మెగా పవర్ స్టార్. దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో.. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి ఈ సినిమాతో శంకర్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.