‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ కాన్సిల్ చేసి మా హీరోతో సినిమా చెయ్యి

Published : Apr 05, 2023, 07:13 AM IST
 ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ కాన్సిల్ చేసి మా హీరోతో సినిమా చెయ్యి

సారాంశం

పవన్ కళ్యాణ్ తో పూర్తయిన తర్వాత హరీశ్‌- రవితేజ కాంబోలో సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయి. ఈ మేరకు హరీష్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. రవితేజ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

దర్శకుడుగా హరీష్ శంకర్ కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఆయనకు సెపరేట్ ప్యాన్ బేస్ కూడా ఉంది. ఆయన డైలాగులుకు విజిల్స్ వేసే ప్రేక్షకజనం, ఆయన సినిమాలకోసం ఎదురుచూసే అభిమానులు ఉన్నారు. అయితే హరీష్ శంకర్ పెద్ద హీరోలతో సినిమాలు చూస్తూండటంతో వాళ్ళ డేట్స్ కోసం వెయిటింగ్ లో ప్రాజెక్టు లు లేటు అవుతున్నాయి. హరీశ్‌ ఇప్పటికే పవన్‌ కల్యాణ్‌తో ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ (Ustaad Bhagat Singh) సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. 

సూపర్‌హిట్‌ చిత్రం ‘గబ్బర్‌సింగ్‌’ తర్వాత మరోసారి పవన్‌తో హరీశ్‌ పని చేస్తుండడంతో ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2021లో ఆ చిత్రాన్ని అనౌన్స్‌ చేసినా పలు కారణాల వల్ల ఇప్పటికీ ప్రారంభంకాలేదు.  అయితే హరీష్ తమ హీరోతో మరో సారి సినిమా చేస్తే చూడాలనేది రవితేజ అభిమానుల కోరిక.  పవన్ కళ్యాణ్ తో పూర్తయిన తర్వాత హరీశ్‌- రవితేజ కాంబోలో సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయి. ఈ మేరకు హరీష్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. రవితేజ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

 రైటర్‌గా కెరీర్ ప్రారంభించిన హరీష్‌ శంకర్‌ ‘షాక్’ (Shock) మూవీతో దర్శకుడు అయ్యాడు. ఆ మూవీ షాక్ ఇచ్చినా.. మాస్ మహరాజ్ ఇచ్చిన మరొక చాన్స్‌‌ యూజ్ చేసుకుని ‘మిరపకాయ్’తో (Mirapakay) తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు. 2011లో విడుదలైన ఈ చిత్రంలో రవితేజ క్యారెక్టరైజేషన్‌ మలిచిన తీరు ఆయన అభిమానులకు తెగ నచ్చేసింది. కానీ అప్పటి నుంచి ఇద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా రాలేదు. 

కానీ రవితేజ హీరోగా దర్శకుడు సుధీర్‌ వర్మ తెరకెక్కించిన సినిమా ‘రావణాసుర’ (Ravanasura). ఆ చిత్రం ఏప్రిల్‌ 7న విడుదలకానున్న నేపథ్యంలో రవితేజ.. ట్విటర్‌ వేదికగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ క్రమంలో ‘హరీశ్‌శంకర్‌తో మరో సినిమా ప్లాన్‌ చేయండి’ అని ఓ ఫ్యాన్‌ కోరాడు. ‘అన్నా హరీశ్‌ శంకర్‌ నిన్నే ఏదో అడుగుతున్నారు’ అని రవితేజ.. హరీశ్‌ ఖాతాను ట్యాగ్‌ చేశారు. దానిపై స్పందించిన ఆయన తమ కాంబోలో మరో చిత్రం వస్తుందని ప్రకటించారు. 

తమ గత సినిమాకు పూర్తిభిన్నంగా కొత్త సినిమా ఉండనుంది. ట్విటర్‌ వేదికగా హరీశ్‌శంకర్‌ ఈ వివరాల్ని ప్రకటించారు. ‘‘రవితేజ అన్నయ్యతో కలిసి పనిచేసేందుకు నేనెప్పుడూ సిద్ధమే. ఈసారి పీరియాడికల్‌ డ్రామాతో. అతి త్వరలోనే మేం హిస్టరీ రిపీట్‌ చేయబోతున్నాం’’ అని హరీశ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. రవితేజ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా హరీశ్‌ ట్వీట్‌ చేశారు. ఈ క్రేజీ కాంబోలో గతంలో ‘షాక్‌’(Shock), ‘మిరపకాయ్‌’ (Mirapakay) చిత్రాలొచ్చిన సంగతి తెలిసిందే. అలా  హీరో రవితేజ (Ravi Teja)- దర్శకుడు హరీశ్‌శంకర్‌ (Harish Shankar) కాంబినేషన్‌లో మరో చిత్రం తెరకెక్కనుంది. ఇక ఈ సినిమా విషయం ప్రకటించగానే కొందరు వీరాభిమానులు..‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ కాన్సిల్ చేసి రవితేజతో సినిమా చేయమని కొందరు, మరికొందరు పీరియడ్ డ్రామా వద్దు ..మిరపకాయ 2 చేయమని మరొకరు, ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ లో రవితేజ చేత చిన్న కామియో చేయించమని మరొకరు కామెంట్స్ తో హోరెత్తించారు. 

అంటే  టైగర్ నాగేశ్వరరావు తర్వాత రవితేజ మరో పీరియాడిక్ డ్రామా చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్టు కన్నా ముందు కార్తీక ఘట్టమనేనిని డైరక్టర్ గా పరిచయం చేస్తున్న ఈగల్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత తమిళ డైరెక్టర్ తో ఇంకో ప్రాజెక్టు చర్చల దశలో ఉంది.
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss 9 Finale Voting : కళ్యాణ్ పడాల , తనూజ మధ్య అసలు పోటీ.., ఫినాలే ఓటింగ్ లో ఎవరు ముందున్నారంటే?
Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ