Pakka Commercial: 'పక్కా కమర్షియల్' కలెక్షన్స్ పరిస్దితి ఏమిటి?

By Surya PrakashFirst Published Jul 2, 2022, 11:48 AM IST
Highlights

పక్కా కమర్షియల్‌ ఫార్మాట్‌లో రూపొందిన ఈ చిత్రం  ఈ శుక్రవారం(జులై 1) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి రివ్యూలు మిక్సెడ్ గా వచ్చాయి. ఫ్లాఫ్ అని ఎవరూ అనలేదు కానీ హిట్ అని కూడా కన్ఫ్రమ్ గా చెప్పలేదు.  ఈ నేపధ్యంలో ఈ చిత్రం భాక్సాఫీస్ దగ్గర ఏ విధంగా ఫెరఫామ్ చేయబోతోందనే విషయం ట్రేడ్ లో డిస్కషన్ పాయింట్ గా మారింది. 

ఎంటర్టైన్మెంట్ కు కేరాఫ్ ఎడ్రస్ గా నిలిచే దర్శకుడు  మారుతి తెరకెక్కించిన సినిమా 'పక్కా కమర్షియల్'. మ్యాచో హీరో గోపీచంద్‌, అందాల బ్యూటీ రాశీఖన్నా జంటగా నటించిన ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించారు. టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ నుంచి ఈ చిత్రంపై సినీ ప్రియులకు ఆసక్తి పెరిగింది. రీసెంట్ గా విడుదలైన టీజర్‌, ట్రైలర్‌, పాటలకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్‌ గ్రాండ్‌గా చేయడం ఈ సినిమాపై ఎక్సపెక్టేషన్స్ పెంచాయి. పక్కా కమర్షియల్‌ ఫార్మాట్‌లో రూపొందిన ఈ చిత్రం  ఈ శుక్రవారం(జులై 1) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి రివ్యూలు మిక్సెడ్ గా వచ్చాయి. ఫ్లాఫ్ అని ఎవరూ అనలేదు కానీ హిట్ అని కూడా కన్ఫ్రమ్ గా చెప్పలేదు.  ఈ నేపధ్యంలో ఈ చిత్రం భాక్సాఫీస్ దగ్గర ఏ విధంగా ఫెరఫామ్ చేయబోతోందనే విషయం ట్రేడ్ లో డిస్కషన్ పాయింట్ గా మారింది. 

అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం ఫస్ట్ డే కలెక్షన్స్ డీసెంట్ గా ఉన్నాయి.   ఫస్ట్ డే మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు ఆన్ లైన్ టికెట్ సేల్స్15-20% రేంజ్ లో జరగగా ఈవినింగ్ షోల టైం కి 25% రేంజ్ లో నైట్ షోల బుకింగ్స్ 30% రేంజ్ లో ఉండటం ఊరట ఇచ్చే అంశం.  ఓవరాల్ గా ఆన్ లైన్ టికెట్ సేల్స్ యావరేజ్ గానే ఉండగా….ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ చాలా సెంటర్స్ లో  బాగున్నాయి. అయితే  ఓవరాల్ గా మాత్రం గోపీచంద్ సీటిమార్ తో పోల్చితే చాలా తక్కువగానే ఉన్నాయి.  మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు ఇప్పటిదాకా అందుతున్న లెక్కలని బట్టి …1.6 కోట్ల నుండి 1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుందని సమాచారం.

మార్కెట్ లో చెప్పుకోదగ్గ సినిమా లేకపోవటం, పిల్లలకు శెలవలు పూర్తవటంతో థియోటర్స్ దగ్గర జనం బాగానే ఉన్నారు. కాబట్టి  ఈ రోజు నుంచి నుంచి  ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ఇంకా పెరిగితే 2 కోట్ల రేంజ్ లో  అందుకోవచ్చు. అంతకుమించి వస్తే కనుక సినిమా ఉన్నంతలో బాగానే ఓపెన్ అయింది అని చెప్పాలి.  అయితే మౌత్ టాక్ యావరేజ్ గా ఉండటం తో ఎంతవరకూ ఈ సినిమా భాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ అవుతుందనేది భాక్సాఫీస్ ఎదురుగా ఉన్న పెద్ద ప్రశ్న. 

click me!