Salaar:'సలార్' రెండు పార్ట్ లు ఖాయం ...ఇవిగో సాక్ష్యాలు

By Surya Prakash  |  First Published Jul 2, 2022, 10:29 AM IST


ప్ర‌శాంత్ నీల్ ప్ర‌భాస్ తో ఓ సినిమా చేస్తున్నాడు. అదే.. `స‌లార్‌`. దీనికి కూడా కేజీఎఫ్ ఫార్ములానే అప్ల‌య్ చేశాడ‌ని, స‌లార్ ని రెండు భాగాలుగా విడుద‌ల చేస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.


 పెద్ద సినిమా ప్రతీది రెండు పార్ట్ లుగా ప్లాన్ చేస్తున్నారు డైరక్టర్స్. లేకపోతే బడ్జెట్ వర్కవుట్ కావటం లేదు. అదే క్రమంలో సలార్ కూడా రూపొందుతోందని వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత అలాంటిదేమీ లేదు అని తేల్చారు. అయితే ఇప్పుడు సలార్ రెండు పార్ట్ లు గా  తీస్తున్నారనేది నిజమేనంటూ కొన్ని వార్తలు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అందుకు కొన్ని ఆధారాలు, సాక్ష్యాలు కూడా చూపెడుతున్నారు. వివరాల్లోకి వెళితే..
 
ప్రభాస్‌ హీరోగా కేజీఎఫ్‌ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్‌ సినిమా గురించి గత ఏడాది కాలం గా ఏదో ఒక వార్త  మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది.అయితే ఈమద్య కాలంలో ఒక వార్త తెగ వైరల్ అయ్యింది. అదే ప్రశాంత్ నీల్‌ సలార్‌ సినిమా ను రెండు పార్ట్‌ లుగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.రెండు పార్ట్‌ లకు కూడా ఒకే సారి షూటింగ్ ను చేస్తున్నారని.  రెండు పార్ట్‌ లను కూడా మూడు లేదా నాలుగు నెలల గ్యాప్ లో విడుదల చేయబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున మీడియా లో వార్తలు వచ్చాయి.  అయితే ఓ కన్నడ జర్నలిస్ట్ దాన్ని ఖండిచారు. ఆ  వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఆయన కన్నడ జర్నలిస్ట్‌ కు ఫోన్ ద్వారా తెలియజేశాడని అన్నారు. అయితే  రెండు పార్ట్ లు విషయమే నిజం అని ఓ వర్గం మీడియా అంటోంది.

ప్రస్తుతం హైదరాబాద్ లో సలార్ షూటింగ్ జరుగుతోంది.  అక్కడ యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఇవన్ని క్లోజ్ గా ఫాలో అవుతున్న ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసిన దాన్ని బట్టి...ఇప్పటికి ఐదు యాక్షన్ సీన్స్ తీసారు. ఇది ఆరవ యాక్షన్ సీన్. మళయాళం సూపర్ స్టార్ పృధ్వీరాజ్ ఇంకా జాయిన్ కావాల్సి ఉంది. అతనితో ప్రభాస్ కు మధ్య యాక్షన్ సీన్స్ ఖచ్చితంగా ఉంటాయి. అవి భారీ ఎత్తున ఉంటాయి. ఇవన్నీ చూస్తూంటే ఒకే సినిమాలో ఇన్ని యాక్షన్ ఎపిసోడ్స్ పెట్టరు. కాబట్టి ఖచ్చితంగా రెండు పార్ట్ లుగా ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారని వారి విశ్లేషణ.

Latest Videos

ఇక దర్శకుడు ప్రభాస్  గత చిత్రం కేజీఎఫ్‌ కూడా రెండు పార్ట్‌ లు గా వచ్చింది.  ప్రభాస్ ఇంతకు ముందు సినిమా బాహుబలి రెండు పార్ట్‌ లుగా వచ్చింది.తాజాగా పుష్ప సినిమా రెండు పార్ట్‌ లు.రెండు పార్ట్‌ లు అనేది ఈమద్య కాలంలో సక్సెస్ ఫార్ముల అయ్యింది.  సలార్‌ ను కూడా రెండు పార్ట్‌ లు గా విడుదల చేయడం ద్వారా మంచి లాభాలను దక్కించుకోవచ్చు.

click me!