అరాచకం: ‘ఉప్పెన’ వీకెండ్ కలెక్షన్స్ |

By Surya Prakash  |  First Published Feb 15, 2021, 3:22 PM IST


మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ ప్రధాన పాత్రలో దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కించిన చిత్రం ‘ఉప్పెన’. కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ పాత్రలో కనిపించాడు.


మెగామేనల్లుడు వైష్ణ‌వ్ తేజ్ న‌టించిన చిత్రం ఉప్పెన‌. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టించింది. తమిళ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ రచన సహకారం అందించిన ఈ చిత్రం వేసవిలోనే కావాల్సి ఉంది కానీ లాక్ డౌన్ కారణంగా వాయిదాపడుతూ వచ్చింది. బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డివైడ్ టాక్ ని మూట కట్టుకుంది. ఈ నేపథ్యంలో ‘ఉప్పెన’ వీకెండ్ కలెక్షన్స్ ఎంత అనేది అంతటా హాట్ టాపిక్ గా మారింది.  
 
ఏ ఏరియాలో ఎంత వసూలు చేసింది
 

ఏరియా              కలెక్షన్స్(కోట్లలో)

Latest Videos

 
నైజాం                          8.53

సీడెడ్                          3.70

నెల్లూరు                        0.86

కృష్ణ                            1.76

గుంటూరు                     2.07

వైజాగ్                          4.12

ఈస్ట్                            2.36

వెస్ట్                             1.53

ఏపీ అండ్ టీఎస్ షేర్ 24.97 కోట్లు 

కర్ణాటక                        1.31

తమిళనాడు                  0.48

ఇతర ప్రాంతాలు            0.33

ఓవర్సీస్                      1.20

వరల్డ్ వైడ్ షేర్            28.29 కోట్లు 

 టాక్ సంగతి మొదట్లో డివైడ్ గా వినిపించినప్పటికీ ఫైనల్ గా కలెక్షన్ల సునామి దీన్ని సూపర్ హిట్ స్థాయిని దాటుతోందనేది ట్రేడ్ వర్గాల సమాచారం.ముఖ్యంగా టికెట్ రేట్ల పెంచటం ఉప్పెనకు చాలా ప్లస్ అయ్యింది. డెబ్యూ హీరోల్లో ఇప్పటిదాకా టాప్ లో ఉన్న అఖిల్, చిరుతలను దాటేసి ఉప్పెన ఇంకా స్ట్రాంగ్ గా దూసుకుపోతోంది. అంతేకాకుండా ఈ సినిమాకు పోటీగా ఇంకే చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడం ఉప్పెన కు ప్లస్ అయ్యింది .  ఈ రోజు సోమవారం నుంచి వసూళ్లు ఎలా ఉండబోతున్నాయనేది కీలకంగా మారుతుంది.

 ఇక ఈ సినిమా నిడివి 2 గంటల 27 నిమిషాలు. రిలీజ్ కు ముందే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ – సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. దాంతో ఉప్పెన సినిమా పై  మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విచ్చేసిన దర్శకులందరు సినిమాపై ప్రశంశల వర్షం కురిపించారు. మొదటి రోజే కలెక్షన్స్ దుమ్ము రేపిన ఈ సినిమా రాబోయే రోజుల్లో.. ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. 

click me!