కోట గోపురంలో నిహారిక, చైతన్యల ప్రేమ ప్రతిబింబం..వైరల్‌ అవుతున్న ఫోటో

Published : Feb 15, 2021, 01:39 PM IST
కోట గోపురంలో నిహారిక, చైతన్యల ప్రేమ ప్రతిబింబం..వైరల్‌ అవుతున్న ఫోటో

సారాంశం

వాలెంటైన్స్ డేని పురస్కరించుకుని ఓ అద్భుతమైన ఫోటోని పంచుకుంది నిహారిక. ఓ కోట గోపురం మధ్యలో సూర్య కిరణాలు పడుతుండగా, గోపురంలోని నిహారిక, చైతన్య ఫోటోలను ప్రతిబింబించేలా ఉందీ ఫోటో.  తమ ప్రేమని వ్యక్తం చేసుకుంటూ ఇద్దరు ఇంటెన్స్ సీన్‌లో ఉన్న ఫోటో ఇది. 

మెగా డాటర్‌ నిహారిక గతేడాది డిసెంబర్‌లో చైతన్యని వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఈ కొత్త పెళ్లి కూతురు ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. పెళ్లైన కొత్తలో ఉండే కిక్‌ని ఆస్వాధిస్తుంది. వీరి మ్యారేజ్‌ అయిన తర్వాత వచ్చిన తొలి వాలెంటైన్స్ డే కావడంతో తమ ప్రేమని మరింతగా పంచుకున్నారీ జోడి. తాజాగా వాలెంటైన్స్ డేని పురస్కరించుకుని ఓ అద్భుతమైన ఫోటోని పంచుకుంది నిహారిక. ఓ కోట గోపురం మధ్యలో సూర్య కిరణాలు పడుతుండగా, గోపురంలోని నిహారిక, చైతన్య ఫోటోలను ప్రతిబింబించేలా ఉందీ ఫోటో. 

తమ ప్రేమని వ్యక్తం చేసుకుంటూ ఇద్దరు ఇంటెన్స్ సీన్‌లో ఉన్న ఫోటో ఇది. ఆద్యంతం ఆకట్టుకుంటుంది. తమ ప్రేమకి నిదర్శనంగా నిలుస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. నిహారిక, చైతన్య మ్యారేజ్‌ వెనకాలు పెద్ద లవ్‌ స్టోరీ ఉందనేది తాజాగా తెలిపిన విషయం తెలిసిందే. దీంతో వీరి లవ్‌ స్టోరీ ఆసక్తి నెలకొంది. డిసెంబర్‌ 9న గ్రాండ్‌గా వివాహం చేసుకున్నారు. జీవితంలో ఎప్పటికీ గుర్తిండిపోయేలా వీరి వివాహ వేడుక జరిగింది. అది టాలీవుడ్‌లోనూ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యింది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా