ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఊపుకి రామ్ కు సంక్రాంతి కానుకగా వచ్చిన రెడ్ బ్రేకులు వేసింది. ఎంతో అలోచించి రెడ్ మూవీ కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. డ్యూయెల్ రోల్ చేసినా పట్టించుకునే వాళ్లు కరువు అయ్యారు. కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో వచ్చిన ఓటిటి ఆఫర్స్ ని రామ్ అస్సలు లెక్క చెయ్యకుండా థియోటర్స్ లో విడుదల చేయటం కలిసి రాలేదు. ఈ నేపధ్యంలో రామ్ నెక్స్ట్ సినిమాపై అందరిలో ఆశక్తి నెలకొంది. ఇప్పుడు ఏ దర్శకుడితో, రామ్ ఎలాంటి సబ్జెక్టు చేస్తాడు..అంటే మాస్ సినిమా చేస్తాడా లేక లవర్ బాయ్ కాన్సెప్టుతో ముందుకు వెళ్తాడా అని ఎదురు చూస్తున్నారు.

దానికి తోడు రామ్ మధ్యలో శివ మాల వేసాను..కాస్త బ్రేక్ అన్నాడు. గ్యాప్ తీసుకుని రిలాక్స్ అవుతున్నాడేమో అనుకుంటున్నారు అంతా. అయితే తాజాగా రామ్ ఓ సబ్జెక్ట్ విని ఎగ్జైటై సినిమా ప్రకటించబోతున్నట్లు సమాచారం. దాదాపుగా రామ్ - లింగు స్వామి కాంబో ఫిక్స్ అయ్యిపోయింది అని తెలుస్తోంది. సమంతతో యు టర్న్ సినిమా చేసిన నిర్మాతలు శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు నిర్మించబోతున్నట్లుగా సమాచారం. మరి రామ్ - లింగు స్వామి బ్యాక్ డ్రాప్ ఎలా ఉండబోతుంది.. మాస్ లేదా లవ్ స్టోరీ నా అనేది ప్రస్తుతానికి వేచి చూడాలి.
లింగు స్వామీ ఇప్పటికే ఆవారా, సికిందర్ వంటి సినిమాలతో తెలుగులోనూ మంచి పేరు తెచ్చుకున్నారు. మరి రామ్‌తో అతడు ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి. మరో ప్రక్క రామ్ ఇప్పటికే వెంకీ కుడుముల చెప్పిన ప్రేమకథను రిజెక్ట్ చేశారు. దాంతో రామ్ తన తదుపరి చిత్రంగా పక్కా మాస్ సబ్జెక్టుని ఎంచుకుంటారని తెలుస్తోంది.
గతంలో లింగుస్వామి అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమా లాంచ్ అయ్యింది కూడా.అయితే కథ విషయంలో ఇద్దరికి సింక్ అవ్వకపోవడంతో ఆ ప్రాజెక్ట్ వెనక్కి వెళ్ళిపోయింది. అయితే మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత స్ట్రైట్ తెలుగు సినిమా చేయడానికి లింగుస్వామి హీరో రామ్ ని ఎంచుకున్నాడని తెలుస్తుంది. అయితే అప్పట్లో అల్లు అర్జున్ కు చెప్పిన పాయింట్ నే ఇప్పటికి మార్చి చేయబోతున్నాడని అంటున్నారు. ఆ వెర్షన్ నే స్క్రిప్టుగా చేసి రామ్ కి కథ కూడా చెప్పడం జరిగిందని, అది అతనికి నచ్చడంతో సెట్స్ పైకి తీసుకొని వెళ్ళడానికి రెడీ అయినట్లు తెలుస్తుంది.