'గూఢచారి', 'చిలసౌ' వీకెండ్ బాక్సాఫీస్ కలెక్షన్స్!

Published : Aug 06, 2018, 04:26 PM IST
'గూఢచారి', 'చిలసౌ' వీకెండ్ బాక్సాఫీస్ కలెక్షన్స్!

సారాంశం

ప్రీమియర్ షోస్ ద్వారా 53 వేల డాలర్లు వసూలు చేసిన ఈ సినిమా శుక్రవారం లక్ష డాలరు, శనివారం లక్షన్నర డాలర్లు, ఆదివారం మరో లక్ష డాలర్లను వసూలు చేసినట్లుగా ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. 

గత శుక్రవారం విడుదలైన మూడు చిత్రాల్లో 'చిలసౌ', 'గూఢచారి' సినిమాలు పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్నాయి. రెండు వేర్వేరు జోనర్లకు చెందిన సినిమాలు కావడంతో రెండు చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా గూఢచారి సినిమాకు భారీ కలెక్షన్స్ వసూలు అవుతున్నాయి. తొలి వీకెండ్ లో ఈ సినిమాలకు ఓవర్సీస్ లో మంచి వసూళ్లు దక్కాయని తెలుస్తోంది.

అడివిశేష్ తనే స్వయంగా కథ సిద్ధం చేసుకొని నటించిన 'గూఢచారి' దాదాపు నాలుగు లక్షల డాలర్లను వసూలు చేసింది. ప్రీమియర్ షోస్ ద్వారా 53 వేల డాలర్లు వసూలు చేసిన ఈ సినిమా శుక్రవారం లక్ష డాలరు, శనివారం లక్షన్నర డాలర్లు, ఆదివారం మరో లక్ష డాలర్లను వసూలు చేసినట్లుగా ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఓవర్సీస్ వీకెండ్ కలెక్షన్స్ లో 'చిలసౌ' లుడా మంచి వసూళ్లనే సాధించింది.

వీకెండ్ ముగిసే సమయానికి లక్షా పదహారు వేల డాలర్లను వసూలు చేసింది. యుఎస్ మార్కెట్ లో సుశాంత్ సినిమాకు ఈ రేంజ్ లో వసూలు కావడం విశేషమనే చెప్పాలి. లాంగ్ రన్ లో ఈ సినిమాలు ఇంకెత వసూళ్లు సాధిస్తాయో చూడాలి!

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu: ఈ విషయంలో అందరూ ఫెయిల్ అయ్యారు, బిగ్ బాస్ పై మండిపడ్డ రోహిణీ
Tanuja Bad Luck : జాక్ పాట్ మిస్సైన తనూజ.. బిగ్ బాస్ తెలుగు 9 రన్నరప్ బ్యాడ్ లక్, విన్నర్ ను మించిన రెమ్యునరేషన్ మిస్