ప్రముఖ నిర్మాత చికిత్స పొందుతూ మృతి!

First Published Aug 6, 2018, 3:51 PM IST
Highlights

కన్నడకు చెందిన ఆయనకు బెంగుళూరులో ఐదు సినిమా టాకీస్ లు ఉన్నాయి. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన చికిత్స పొందుతూ ఆశివారం తుదిశ్వాస విడిచారు. 

కన్నడకు చెందిన ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు ఎం.భక్తవత్సలం ఆదివారం బెంగుళూరులో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. 1971 లో 'సంపూర్ణ రామాయణం' సినిమాతో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చారు.

ఆ తరువాత పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన ఆయన సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా, ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ఎంపికయ్యారు. అతి చిన్న వయసులో ఆయన పదవిని అధిరోహించారు. కన్నడ సినిమాలకు ఆయన చేసిన సేవలకు గాను 2012లో డా.రాజ్ కుమార్ అవార్డు ను సొంతం చేసుకున్నారు. ఆయనకు బెంగుళూరులో ఐదు సినిమా టాకీస్ లు ఉన్నాయి.

కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన చికిత్స పొందుతూ ఆశివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.  
 

click me!