ఫ్లైట్ లో మహేష్ కి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పిన చిరు.. ఒకే ఫ్రేమ్ లో వారంతా

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 10, 2022, 12:46 PM IST
ఫ్లైట్ లో మహేష్ కి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పిన చిరు.. ఒకే ఫ్రేమ్ లో వారంతా

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి నేడు ఏపీ సీఎం వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. చిరుతో పాటు ఈ భేటీకి కొరటాల శివ, రాజమౌళి, ప్రభాస్, మహేష్ బాబు ఇంకా మరికొందరు టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.

మెగాస్టార్ చిరంజీవి నేడు ఏపీ సీఎం వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. చిరుతో పాటు ఈ భేటీకి కొరటాల శివ, రాజమౌళి, ప్రభాస్, మహేష్ బాబు ఇంకా మరికొందరు టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. టాలీవుడ్ సమస్యలు, టికెట్ వివాదంపై పరిష్కారం దిశగా చిరంజీవి జగన్ తో చర్చలు జరపనున్నారు. 

వీరంతా ప్రత్యేక విమానంలో బేగంపేట నుంచి తాడేపల్లికి ఈ ఉదయం బయలుదేరారు. చిరు, కొరటాల, మహేష్, ప్రభాస్, రాజమౌళి విమానంలో వెళుతుండగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నేడు మహేష్, నమ్రత దంపతులు 17వ వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు. 

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మహేష్ బాబుకి విమానంలోనే శుభాకాంక్షలు తెలిపారు. రాజమౌళి, ప్రభాస్, కొరటాల శివ కూడా మహేష్ ని విష్ చేశారు. ఏ విషయాన్ని చిరంజీవి స్వయంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. సోషల్ మీడియాలో ఈ పిక్ వైరల్ గా మారింది. 

'మహేష్ బాబు, నమ్రత ఇద్దరికీ వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు. మీరిద్దరూ జీవితాంతం చిరునవ్వులతో సంతోషంగా ఉండాలి/ అని చిరు ట్వీట్ చేశారు. 

ఇదిలా ఉండగా సీఎం జగన్ తో నేటి భేటీ టాలీవుడ్ కు చాలా కీలకంగా మారింది. తగ్గిన టికెట్ ధరలు బడా చిత్రాలకు ఇబ్బందిగా మారాయి. రాబోవు రోజుల్లో భీమ్లా నాయక్, ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్, ఆచార్య, సర్కారు వారి పాట లాంటి చిత్రాలు రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Kalyan Padala తో వర్కౌట్‌ కాకపోవడంతో డీమాన్‌ పవన్‌ని పట్టుకుంది.. ట్రోల్స్ పై రీతూ చౌదరీ రియాక్షన్‌ ఇదే
BBK 12 Finale: బిగ్ బాస్ ప్రకటించకముందే విన్నర్ పేరు లీక్ చేసిన వికీపీడియా.. విజేత ఎవరో తెలుసా?