
2000 సంవత్సంలో రిలీజ్ అయిన తెలుగు ఫిల్మ్ ‘వంశీ’మూవీలో నమ్రత, మహేశ్ బాబు హీరోహీరోయిన్లుగా నటించారు. ఆ మూవీ ఫినిష్ అయ్యే వరకు ప్రేమలో పడిందట ఈ స్టార్ జంట. ఆ తర్వాత ఐదేండ్ల పాటు డేటింగ్ లోఉన్న వీరు 2005 ఫిబ్రవరి 10న సూపర్ స్టార్ మహేశ్ బాబు - నమ్రత వివాహం ఘనంగా జరిగింది. నేటికి వీరి వివాహాం జరిగి 17 ఏండ్లు పూర్తయ్యింది. ఈ సందర్బంగా మహేశ్ బాబు తన ఇన్ స్టా గ్రామ్ లో తన భార్యకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్యామిలీ ఫొటోను పోస్ట్ చేశారు. ‘తెలియకుండా 17 ఏండ్లు గడిచిపోయాయి. ఇంకా చాలా ఏండ్లు ఇలాంటి జీవితం గడపాలి. ఇది ప్రేమతోనే సాధ్యం’అంటూ పేర్కొన్నాడు.
ఇక నమ్రతా శిరోద్కర్ కూడా మహేశ్ బాబుకు విషేస్ తెలిపింది. ఈ సందర్భంగా తాము కలిసి ఉన్న ఫొటో వీడియోను పోస్ట్ చేసి అభిమానులతో పోస్ట్ చేసింది. మహేశ్, నమ్రత ఎంత సరదా ఉంటారో.. ప్రేమగా, ఒకరిపట్ల ఒకరు ఎంత రెస్పెక్ట్ ఉంటారో తెలిపే ఫొటోలను వీడియోలో జతచేసింది. ‘నా చిన్న వివాహ వంటకం : హాస్యం, నమ్మకం, గౌరవం, దయ మరియు సహనంతో కూడిన చాలా ప్రేమ. జీవితాంతం ఉడకనివ్వండి.. ప్రతిసారీ రుచిగా ఉంటుంది.’ అంటూ ఇన్ స్టాలో నోట్ రాసింది.
ఇక సోషల్ మీడియాలో తన అభిమానులతో ఆమె ఇంటర్వ్యూలు మరియు ఇంటరాక్షన్‌లలో మిలియన్ల మంది హృదయాలను దోచుకుంటుంది. అందమైన నటి సౌత్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య, మరియు వారు తరచుగా దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో 'ఉత్తమ జంట' గా పేరుగాంచారు.
నమ్రతా శిరోద్కర్ మరియు మహేష్ బాబు 2005లో వివాహం చేసుకున్న ఈ సెలబ్రెటీ జంట 2006లో వారి మొదటి బిడ్డ గౌతం కృష్ణకు జన్మనిచ్చారు. 2012లో ఈ జంట మళ్లీ సితారకు జన్మనిచ్చారు. మహేశ్ బాబు తన పిల్లలతో ఎంత సరదాగా ఉంటారో ఆయన పంచుకున్న పలు వీడియోల ద్వారా అర్థమౌతోంది.