
మాస్ మహారాజ్ రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఖిలాడీ. ఫిబ్రవరి 11న ఈ చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. దీనితో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ చిత్రంలో రవితేజకి జోడిగా డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.
బుధవారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కారణంగా ఈ చిత్రంపై చాలా అనుమానాలు తలెత్తుతున్నాయి. అందుకు కారణం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రవితేజ చేసిన ప్రసంగం. రవితేజ తన స్పీచ్ లో ఎక్కువగా దర్శకుడు, నిర్మాతపై సెటైర్లు వేసే ప్రయత్నం చేశాడని జోరుగా చర్చ జరుగుతోంది. రవితేజకు, డైరెక్టర్ రమేష్ వర్మకు మధ్య విభేదాలు తలెత్తినట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రవితేజ ఆ వార్తలకు బలం చేకూర్చారు. రవితేజ దర్శకుడి వర్క్ అభినందిస్తూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సో రవితేజ, రమేష్ వర్మ మధ్య ఏదో వివాదం జరుగుతోందనేది క్లియర్ అని అంటున్నారు.
రవితేజ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. నేను ఈ సినిమా ఒప్పుకుంది కేవలం రచయిత శ్రీకాంత్ విస్సా కోసమే అని అన్నారు. రవితేజ ఈ విషయాన్ని నొక్కి మరీ చెప్పారు. నేను అదృష్టాన్ని నమ్ముకోను. కానీ రమేష్ వర్మని చూస్తే అదృష్టాన్ని కూడా నమ్మాలనిపిస్తోంది అని రవితేజ అన్నారు.
ఇక నిర్మాత గురించి మాట్లాడుతూ.. సర్ మీరు సెట్స్ కి తప్పకుండా రావాలి. అప్పుడే ఏం జరుగుతుందో మీకు అర్థం అవుతుంది అని రవితేజ సెటైరికల్ గా కామెంట్స్ చేశారు. సినిమా రిలీజ్ కాకముందే రమేష్ వర్మకి నిర్మాత కారు గిఫ్ట్ గా కూడా ఇచ్చారు అని రవితేజ అన్నారు. రవితేజ ఇలా వరుసగా సెటైర్లు వేయడానికి కారణం రమేష్ వర్మతో ఉన్న విభేదాలే అని తెలుస్తోంది. ఖిలాడీ టీం పట్ల రవితేజ హ్యాపీగా లేడని టాక్.