న్యాయం జరుగుతుందనే నమ్మకం పోయింది!

First Published Jul 2, 2018, 12:47 PM IST
Highlights

నటిపై లైంగిక వేధింపుల కేసుల అరెస్ట్ అయిన నటుడు దిలీప్ ప్రస్తుతం బెయిల్ పై బయటకి వచ్చారు

నటిపై లైంగిక వేధింపుల కేసుల అరెస్ట్ అయిన నటుడు దిలీప్ ప్రస్తుతం బెయిల్ పై బయటకి వచ్చారు. సినిమా షూటింగ్ లలో కూడా పాల్గొంటున్నారు. దీంతో అతడిపై నిషేధం విధించిన అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్(AMMA) దాన్ని ఎత్తివేసి తిరిగి దిలీప్ ను అమ్మలో సభ్యుడిగా చేర్చుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంపై ఇండస్ట్రీలో ఉన్న నటీమణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజాగా 'విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (WCC)' తరఫున 15 మంది సీనియర్ తారలు అమ్మ నుండి తప్పుకోవడంతో పాటు ఎట్టిపరిస్థితుల్లో తిరిగి చేరబోమని ఓ ప్రకటన విడుదల చేశారు. మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదు.. ఇంక 'అమ్మను నమ్మే ప్రసక్తే లేదంటూ ప్రకటనలో వెల్లడించారు. అక్కినేని అమల, శాంతి బాలచంద్రన్, రంజనీ, సజిత ఇలా చాలా మంది ఈ లిస్ట్ లో ఉన్నారు.

మహిళలను ఆటబొమ్మలుగా చూసే ఈ వైఖరి మారాలని ఏకపక్ష నిర్ణయాలు అమలు కావడానికి వీళ్లేదని.. తోటి నటిని లైంగిక వేధింపులకు గురి చేసిన వ్యక్తిని అమ్మ సపోర్ట్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదని ఇలా ఎనిమిది కారణాలతో కూడిన ఒక లెటర్ ను విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ అఫీషియల్ ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టారు. 
 

click me!