బాలీవుడ్ ప్రయత్నాలు మానను.. ప్రియాంకతో కలిసి నటించాలనుంది!

Published : Jul 02, 2018, 12:17 PM IST
బాలీవుడ్ ప్రయత్నాలు మానను.. ప్రియాంకతో కలిసి నటించాలనుంది!

సారాంశం

టాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకున్న తారలు బాలీవుడ్ లో కూడా తన టాలెంట్ నిరూపించుకోవాలని 

టాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకున్న తారలు బాలీవుడ్ లో కూడా తన టాలెంట్ నిరూపించుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో నేటి తరం హీరోయిన్లు చాలా మంది బాలీవుడ్ లో సత్తా చాటే ప్రయత్నం చేశారు. నటుడు రామ్ చరణ్ కూడా బాలీవుడ్ లో 'జంజీర్' అనే సినిమాలో నటించాడు.

ఇదే సినిమా తెలుగులో తుఫాన్ అనే పేరుతో విడుదలైంది. అయితే ఈ సినిమా అనుకున్న విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నానని కానీ ఫలితం తనను చాలా నిరాశ పరిచిందని రామ్ చరణ్ అన్నారు. అలానే మరోసారి బాలీవుడ్ లో ఛాన్స్ వస్తే ప్రియాంకచోప్రాతో కలిసి నటిస్తానని అన్నారు. ''బాలీవుడ్ లో జంజీర్ మొదటి సినిమా కావడంతో చాలా కష్టపడ్డాను కానీ రిజల్ట్ మాత్రం అనుకున్నట్లుగా రాలేదు. అలా అని బాలీవుడ్ ప్రయత్నాలు మాత్రం మానను. మంచి కథ దొరికితే మరోసారి బాలీవుడ్ లో సినిమా చేయడానికి రెడీ.. అలానే ప్రియాంక చోప్రాతో కూడా చేయాలనివుంది.

ఆమె టాలెంటెడ్ యాక్ట్రెస్'' అని వెల్లడించారు. ప్రస్తుతం రామ్ చరణ్.. బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ ఏడాది దసరా కానుకగా ఆ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో తారక్ తో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించనున్నాడు.  

PREV
click me!

Recommended Stories

Bandla Ganesh: రాంచరణ్ పెద్ది కోసం పవన్ కళ్యాణ్ త్యాగం.. బండ్ల గణేష్ కామెంట్స్ వైరల్
Maa Inti Bangaram Review: మా ఇంటి బంగారం మూవీ రివ్యూ.. సమంత కమ్‌ బ్యాక్‌ ఫిల్మ్ ఎలా ఉందంటే?