Mahesh Babu:రాజమౌళి కారణంగా పాన్ ఇండియా హిట్ మిస్ అయిన మహేష్!

Published : Mar 31, 2022, 01:59 PM ISTUpdated : Mar 31, 2022, 02:09 PM IST
Mahesh Babu:రాజమౌళి కారణంగా పాన్ ఇండియా హిట్ మిస్ అయిన మహేష్!

సారాంశం

పుష్ప స్క్రిప్ట్ మహేష్ బాబు చేయాల్సి ఉండగా... ఆయన రిజెక్ట్ చేయడంతో సుకుమార్ అల్లు అర్జున్ తో చేశారు. మహేష్ పుష్ప చిత్రాన్ని రిజెక్ట్ చేయడం వెనుక రాజమౌళి ఉన్నారంటూ ఓ ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది.

పుష్ప (Pushpa)అల్లు అర్జున్ కెరీర్ కి చాలా ప్లస్ అయ్యింది. హిందీలో రూ. 100 కోట్ల వసూళ్లు సాధించడంతో ఆయన ఇమేజ్ దేశవ్యాప్తమైంది. డీగ్లామర్ లుక్ లో స్మగ్లర్ గా అల్లు అర్జున్ (Allu Arjun)ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. మూడు వందలకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టిన పుష్ప 2021 టాప్ గ్రాసర్ గా నిలిచింది. అయితే ఈ ప్రాజెక్ట్ మహేష్ చేయాల్సి ఉంది. ఫస్ట్ పుష్ప స్క్రిప్ట్ సుకుమార్ మహేష్ కి వినిపించారు. మహేష్ పుష్ప చిత్రాన్ని సున్నితంగా తిరస్కరించారు. తనకు డీగ్లామర్ లుక్ సెట్ కాదని భావించిన మహేష్, ప్రయోగాలు వద్దని ఈ ప్రాజెక్ట్ పక్కన పెట్టారని అప్పుడు కథనాలు వెలువడ్డాయి. 

నిజానికి పుష్ప చిత్రాన్ని రాజమౌళి (Rajamouli)చెప్పడంతోనే మహేష్ చేయలేదని మరొక కారణం తెరపైకి వచ్చింది. రాజమౌళి తన తదుపరి ప్రాజెక్ట్ మహేష్ బాబుతో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాదే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా మహేష్ కోసం రాజమౌళి జంగిల్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచరస్ కథను ఎంచుకున్నారట. పుష్ప మూవీ అడవి నేపథ్యంలో సాగే కథ. తన చిత్రం కంటే పుష్ప ముందుగా విడుదలవుతుంది. తన స్క్రిప్ట్ కూడా అడవి నేపథ్యం కాబట్టి బ్యాక్ టు బ్యాక్ మహేష్ చిత్రాలు ఓకే జోనర్ లో విడుదలవుతాయి. 

దీంతో రాజమౌళి మూవీ ప్రత్యేకత కోల్పోతుంది. అది ఆయన చిత్రంపై ప్రతికూల ప్రభావం చూపే ఆస్కారం కలదు. అందుకే మహేష్ తో రాజమౌళి సుకుమార్ పుష్ప చేయవద్దని చెప్పారట. అందుకే మహేష్ పుష్ప చిత్రం నుండి తప్పుకున్నారనేది టాలీవుడ్ టాక్. మరి ఈ న్యూస్ లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రముఖంగా వినిపిస్తోంది. 

ఇక ఆర్ ఆర్ ఆర్ భారీ సక్సెస్ నేపథ్యంలో మహేష్ (Mahesh babu)ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. తమ హీరోకి కూడా బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ (RRR Movie)రేంజ్ హిట్ ఇవ్వనున్నాడని డిసైడ్ అయ్యారు. మరోవైపు మహేష్ మూవీ కోసం రాజమౌళి ఏకంగా రూ. 800 కోట్లు కేటాయించారట. రాజమౌళి-మహేష్ మూవీ పాన్ వరల్డ్ రేంజ్ లో ఉంటుందని సమాచారం. అలాగే వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని రాజమౌళి డిసైడ్ అయ్యారట. 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే