Rajanikanth:రజనీ కొత్త సినిమాకి అంతా సిద్ధం .. హీరోయిన్స్ వీళ్లే !

Surya Prakash   | Asianet News
Published : Mar 31, 2022, 12:29 PM IST
Rajanikanth:రజనీ కొత్త సినిమాకి అంతా సిద్ధం .. హీరోయిన్స్ వీళ్లే !

సారాంశం

రజనీకాంత్ గత చిత్రం ‘అన్నాత్తే’ అనుకున్న స్థాయిలో ఆడలేదు. తెలుగులో ఈ ఫిల్మ్ ‘పెద్దన్న’ పేరిట విడుదల కాగా, ఇక్కడ కూడా అంత రెస్పాన్స్ రాలేదు. ఈ నేపథ్యంలోనే నెక్స్ట్ ఫిల్మ్ పైన దృష్టీ పెట్టారు.  


తమిళ్ తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. వయస్సు పెరుగుతున్నా ఆయన స్టైల్ కు సమస్య రాలేదు. ఇప్పటికి మాస్ ని థియోటర్ లాగే  హీరోగా ఆయనకు పేరుంది.  ఇప్పటికీ ఆయన నటించిన ఫిల్మ్ రిలీజ్ అవుతుందంటే చాలు.. అభిమానులు పండుగ చేసుకుంటారు. తమిళనాట ఆయన్ని ఓ దేవుడిలా ఆరాధిస్తుంటారు. అయితే, రజనీకాంత్ గత చిత్రం ‘అన్నాత్తే’ అనుకున్న స్థాయిలో ఆడలేదు. తెలుగులో ఈ ఫిల్మ్ ‘పెద్దన్న’ పేరిట విడుదల కాగా, ఇక్కడ కూడా అంత రెస్పాన్స్ రాలేదు. ఈ నేపథ్యంలోనే నెక్స్ట్ ఫిల్మ్ పైన దృష్టీ పెట్టారు.

కెరియర్ పరంగా రజనీకాంత్ కి ఇది 169వ సినిమా. ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం ఆయన విజయ్ హీరోగా 'బీస్ట్' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో ఉన్నాడు. ఏప్రిల్ 13 వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. బీస్ట్ హడావిడి తగ్గిన తరువాత .. మే నెలలో రజనీకాంత్ తో ఆయన సెట్స్ పైకి వెళ్లనున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా ఐశ్వర్యరాయ్ పేరు వినిపిస్తోంది.

సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ రజనీకాంత్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు గా తెలుస్తోంది. దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్నారు. అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ రజినీకాంత్ కూతురి పాత్రలో కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. "డాక్టర్" సినిమా తర్వాత ప్రియాంక అరుల్ మోహన్ మరియు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రెండవ సినిమా ఇది. అనిరుధ్ సంగీతాన్ని అందించే ఈ  సినిమా నుంచి త్వరలోనే టైటిల్  తో ప్రకటన వచ్చే అవకాసం ఉంది.

ఈమధ్య శర్వానంద్ హీరోగా "శ్రీకారం" సినిమా తో నటించిన ఈమె శివ కార్తికేయన్ డాక్టర్ సినిమాతో తమిళ ప్రేక్షకులకు కూడా పరిచయం అయింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించడంతో ప్రియాంక అరుల్ మోహన్ కి ఇంకా మంచి ఆఫర్లు రావడం మొదలయ్యాయి. రజనీతో సినిమా చేసాక ఆమె నెక్ట్స్ లెవిల్ కు వెళ్తుందని భావిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే