
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రీసెంట్‌గా రాధేశ్యామ్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ డిజాస్టర్ ఫలితం అందుకుంది. దీంతో ప్రభాస్ నుంచి ఒక యాక్షన్ మూవీ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అందరి దృష్టీ కేజీఎఫ్ దర్శకుడుతో చేస్తున్న సలార్ చిత్రంపైనే ఉంది. ఆ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు అభిమానులు. అయితే వారి ఎదుaరుచూపులకు ఇంకా సమయం పట్టేలా ఉంది. ఎందుకంటే..
‘రాధేశ్యామ్’విడుదలైన వెంటనే, ప్రభాస్ విదేశాలకు వెళ్ళారు. రెస్ట్ కోసం అనుకున్నారు కానీ మోకాలి శస్త్ర చికిత్స కోసం అని తెలిసింది. ఐదేళ్ల క్రితం షూటింగ్ లో జరిగిన గాయం తిరగబెట్టింది. యూరోప్ కి చెందిన ఒక పేరుగాంచిన డాక్టర్ ప్రభాస్ మోకాలికి సర్జరీ చేశారు. ప్రభాస్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నట్లే అని సమాచారం. ఏప్రిల్ లో ‘సలార్’ కొత్త షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం అవుతుంది. ఈ షూటింగ్ లో ప్రభాస్ పాల్గొంటారు.
‘సలార్’ షూటింగ్ తో పాటు దర్శకుడు మారుతి సినిమా ఎప్పుడు మొదలు పెట్టాలి అనే విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ప్రభాస్ ఇకపైన సినిమాల విషయంలో జాగ్రత్త పడతారని తెలిస్తోంది. ప్రభాస్ చేతిలో వరస సినిమాలున్నాయి. ఐతే, ‘సాహో’ అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించకపోవడం, ‘రాధేశ్యామ్’ పూర్తిగా నిరాశపరచడంతో ప్రభాస్ అభిమానులు బాగా డీలాపడ్డారు. అందుకే, ప్రభాస్ ఇకపై మరింత జోష్ గా కనిపించేందుకు సిద్ధమయ్యారు. ‘ఆదిపురుష్’ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది.
శ్రుతి హాసన్ ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా కనిపించనుంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు.ఇప్పటికే వచ్చే ఏడాది సలార్‌ను రిలీజ్ చేయాలని భావించినా షూటింగ్ ఆలస్యమైతే, మరింత సమయం పట్టేలా కనిపిస్తుంది. దీంతో ఈ యాక్షన్ మూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ మరిన్ని రోజులు ఎదురుచూడక తప్పదు. సలార్ షూటింగ్ 60శాతం కూడా పూర్తికాలేదు. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న 'ప్రాజెక్టు K' కూడా సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే.